Suryakumar Yadav India vs Pakistan T20 World Cup | పాక్ తో మ్యాచ్ పై సూర్యకుమార్ హాట్ కామెంట్స్
టీ20 వరల్డ్ కప్ 2026లో ( T20 World Cup 2026 ) హైవోల్టేజ్ ఇండియా పాకిస్తాన్ ( India vs Pakistan ) మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి జరిగిన ప్రెస్ మీట్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) పాకిస్తాన్ కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. సగం మ్యాచులు వాళ్లు, సగం మేం గెలిస్తే కనుక పాక్ ను ప్రత్యర్థి అని పిలవొచ్చు. కానీ పరిస్థితి ఆలా లేదని అన్నాడు.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఒత్తిడి గురించి సూర్యకుమార్ ఆసక్తికరంగా స్పందించాడు. ఒత్తిడి ఎప్పుడూ ఉంటుందని అన్నాడు. భారత్-పాక్ మ్యాచ్ అంటే ప్రత్యేకమైన సందర్భం. ఒత్తిడికి లోనవ్వడం మానవ స్వభావం. కానీ పాక్ జట్టు తమకు సమ ఉజ్జీ మాత్రం కాదని, దాదాపు అన్ని మ్యాచ్ లలో టీమిండియానే నెగ్గిందని పేర్కొన్నాడు. పాక్ సాధారణ జట్టే కానీ బలమైన ప్రత్యర్థిగా భావించడం లేదని అంచనాలు పెంచేశాడు.
అలాగే పాక్ కెప్టెన్ అభిషేక్ పై చేసిన కామెంట్స్ కు కూడా సమాధానమిచ్చాడు సూర్య. ఈ విషయంపై మాట్లాడుతూ పాకిస్తాన్ కెప్టెన్ కోరుకుంటున్నాడు కదా, కాబట్టి అభిషేక్ శర్మ (Abhishek Sharma) మ్యాచ్ ఆడతాడని అన్నాడు. టాస్ సందర్భంగా, మ్యాచ్ ముగిసిన తరువాత హ్యాండ్‌షేక్ గురించి అడిగిన ప్రశ్నకు సూర్య షాకింగ్ సమాధానం ఇచ్చాడు. టాస్ సమయంలో షేక్ హ్యాండ్ ఇవ్వాలా వద్దా అని అప్పుడు ఆలోచిస్తామని తెలివిగా బదులిచ్చాడు.























