Shubman Gill Performance | వరుసగా ఫెయిల్ అవుతున్న శుబ్మన్ గిల్
టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ పెర్ఫార్మన్స్ పై ఇప్పుడు చర్చ మొదలయింది. కెప్టెన్ గా భాద్యతలు తీసుకున్న తర్వాత మంచి ప్రశంశలు అందుకున్నాడు గుల్. కానీ ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన వన్డే సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సిరీస్ లో బ్యాట్స్మన్ గా టీమ్ ను ఆదుకోలేక పొయ్యాడు. ఆసియా కప్ నుంచి చూసుకుంటే గిల్ ఆడిన ఇన్నింగ్స్‌లలో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయాడు.
ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ను డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అదే ఫార్మ్ ను ఆస్ట్రేలియాతో కొనసాగిస్తాడని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ అందుకు రివర్స్ గా జరిగింది. వన్డేలో గెలిచి కెప్టెన్‌గా తొలి విజయాన్ని అందుకున్నప్పటికీ కూడా బ్యాటర్‌గా నిరాశపరిచాడు.
మూడు మ్యాచ్‌లలో 24, 9, 10 పరుగులు మాత్రమే సాధించాడు.
అంటే మొత్తం సిరీస్‌లో చేసింది 43 పరుగులు మాత్రమే. కెప్టెన్ శుబ్మన్ గిల్ ఇలా ఫార్మ్ కోల్పోవడం అనేది టీమ్ ఇండియా కూడా పేద దెబ్బ అనే చెప్పాలి. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20 సిరీస్‌లో గిల్ ఎలాగైనా మంచి ప్రదర్శన కనబర్చాలి.





















