Jasprit Bumrah in Ind vs NZ T20 | కివీస్ ను కుప్పకూల్చిన భారత బౌలర్లు
ఇండియా న్యూజీలాండ్ మధ్య జరిగిన మూడో టీ20లో మన బౌలర్లు సత్తా చాటారు. మొదటి ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసిన భారత్.. న్యూజీలాండ్ బ్యాట్సమన్ కు చుక్కలు చూపించారు. మ్యాచ్ ఆరంభం నుంచే వికెట్స్ పడడంతో న్యూజీలాండ్ బ్యాట్సమన్ వెంటవెంటనే పెవిలియన్ చేరారు. దాంతో కివీస్ తక్కువ పరుగులు చేసి ఇన్నింగ్స్ ను ముగించింది.
హర్షిత్ రాణా ( Harshit Rana ) వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ డెవాన్ కాన్వే ( Devon Conway ) వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో రెండో ఓవర్‌లోనే హార్దిక్ ( Hardik Pandya ) మరో వికెట్ తీసి కివీస్‌పై ప్రెషర్ పెంచాడు. పవర్ ప్లే లోనే కీలక వికెట్స్ కోల్పోవడంతో కివీస్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఆఖరిలో శాన్‌ట్నర్ రాణించడంతో 20 ఓవర్లలో 153 పరుగులు చేసారు.
టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా , రవి బిష్ణోయ్ అద్భుతంగా రాణించారు. హర్షిత్ రాణా 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. రవి బిష్ణోయ్ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకోగా, జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.























