Sai Sudarshan Century vs DC IPL 2025 | వీడిని డకౌట్ చేసే బౌలర్ ఇంకా పుట్టలేదేమో
లాస్ట్ 30 ఇన్నింగ్స్ ల్లో ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. స్లోగా ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడు. ఎక్కడా కంగారు పడడు. మెల్లగా గేర్లు మారుస్తాడు. స్తంభం స్తంభం పాతుకున్నట్లు పాతుకుపోతాడు క్రీజులో. కదలడు మెదలడు ఇక. ఆ బ్యాట్ నుంచి నిన్నటి హాఫ్ సెంచరీలు వచ్చేవి. ఇప్పుడు దాన్ని సెంచరీగా మారుస్తున్నాడు. మీకు ఇటుక ఇటుక పేరుస్తున్నట్లు కనిపిస్తుందేమో. దూరం నుంచి చూడండి సాయి సుదర్శన్ అనే చిన్న తమిళ కుర్రాడు పేరుస్తున్న సాలిడ్ గోడ ఉంది అక్కడ. నమ్మరా ఈ స్కోరు కార్డు చూడండి. గత 30 ఇన్నింగ్స్ లో సాయి సుదర్శన్ స్కోర్లు ఇవి. ఎక్కడైనా సున్నా ఉందా. అసలు సింగిల్ డిజిట్ కి అయ్యింది కేవలం 6సార్లు మాత్రమే. మిగితావన్నీ టీ 20 స్కోర్లే. నిన్న ఢిల్లీ మీద ఛేజింగ్ లో సెంచరీ బాదేశాడు. అది కూడా అలాంటి ఇలాంటి సెంచరీ కాదు. ఈ సీజన్ లో తన అద్భుతమైన ఫామ్ ను మరింత పీక్స్ కి తీసుకెళ్తూ ఛేజింగ్ లో సూపర్ సెంచరీ బాదేశాడు. 61 బాల్స్ లో 12 ఫోర్లు 4 సిక్సర్లతో 108 పరుగులు చేశాడు సాయి సుదర్శన్. ఈ సీజన్ లో మొదటి సెంచరీ ఇది సాయికి. ఈ సెంచరీ కాకుండా మరో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా 617పరుగులు చేశాడు సీజన్ లో. తనకు ప్రధానమైన పోటీ అంటే తన కెప్టెన్ శుభ్ మన్ గిల్ నుంచే 601 పరుగులు చేశాడు గిల్. కానీ సాయి సుదర్శన్ మాత్రం టాప్ క్లాస్ అంతే 156 స్ట్రైక్ రేట్ తో 56 యావరేజ్ తో ఈ సీజన్ లో తనకు ఎదురులేదన్నట్లు దూసుకెళ్తున్నాడు ఈ ఆరెంజ్ క్యాప్ వీరుడు. టీమిండియాలో తన అవకాశం కోసం ఎవడినీ అడుక్కోవట్లేదు. తన బ్యాట్ తన బ్యాట్ మాత్రమే మాట్లాడుతుంది అంటున్నాడు. నిన్న సెంచరీ తర్వాత చేసిన సెలబ్రేషన్స్ లోనూ ఓన్లీ బ్యాట్ విల్ స్పీక్ అని చూపించాడు కాబోయే ఈ టీమిండియా స్టార్ ఓపెనర్ తన టీమ్ ను ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కి పట్టుకెళ్లటంతో పాటు డీసీ ని పదివికెట్ల తేడాతో నిన్న ఓడించి ఆర్సీబీకి, పంజాబ్ కి కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలను కల్పించాడు





















