RR vs RCB Eliminator Match Highlights | ఎలిమినేటర్ లో RCB పై 4 వికెట్ల తేడా RR విక్టరీ | IPL 2024
వరుసగా ఆరు మ్యాచులు గెలిచి ప్లే ఆప్స్ కి అర్హత సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు యధావిధిగా నాకౌట్ లో చోకైంది. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీపై నాలుగువికెట్ల తేడాతో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. 173పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ యంగ్ అండ్ డైనమిక్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ కావాల్సిన ఆరంభాన్ని ఇచ్చాడు. టామ్ కొహ్లర్ తో ఆర్సీబీ బౌలర్లను పవర్ ప్లేలో సమర్థంగా ఎదుర్కొన్నాడు. 30బంతుల్లో 8ఫోర్లతో 45పరుగులు చేసిన జైశ్వాల్ తృటిలో హాఫ్ సెంచరీని కోల్పోయాడు. ఓపెనర్లు యశస్వి, టామ్ కొహ్లర్ తో పాటు కెప్టెన్ సంజూ తక్కువ స్కోరుకే వెనుదిరిగినా రియన్ పరాగ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన షిమ్రోన్ హెట్మెయర్ తో కలిసి RRకి ఊపిరి పోశాడు. ఈ సీజన్ లో తను చూపిస్తున్న అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ 26 బంతుల్లో 2ఫోర్లు 2సిక్సర్లతో 36పరుగులు చేశాడు. పరాగ్ కు హెట్మెయర్ కూడా 26పరుగులతో సహకరించటంతో RR టార్గెట్ వరకూ వచ్చేసింది. చివర్లో పరాగ్, హెట్మెయర్ అవుటైనా మిగిలిన పనిని రెండు ఫోర్లు,ఓ సిక్సర్ బాది రోమెన్ పావెల్ పూర్తి చేయటంతో రాజస్థాన్ నాలుగు వికెట్ల తేడాతో ఆర్సీబీ పై జయభేరి మోగించేలా చేశారు.