RCB vs CSK Match Preview IPL 2025 | నేడే ఆర్సీబీ, సీఎస్కే మధ్య మహా యుద్ధం
మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కొహ్లీ. ఇద్దరూ ఇద్దరే కృష్ణార్జునులు టైప్. ఈ ఇద్దరూ కలిసి టీమిండియాకు అందించిన విజయాలను,..వికెట్ల మధ్య చిరుత పులుల్లా పరుగులు పెట్టిన రోజులను ఏ క్రికెట్ అభిమాని మర్చిపోడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ ను లీగ్ లో అత్యంత విజయవంతమైన టీమ్స్ లో ఒకటిగా నిలిపిన ఘనత ధోనిది. కెప్టెన్ గా తన జట్టుకు ఐదు కప్పులను అందించాడు. మరో వైపు కొహ్లీ ఒక్క సారైనా విజేతగా నిలవకుున్నా ఆర్సీబీ అంటే ఓ బ్రాండ్ అనే స్థాయిని క్రియేట్ చేశాడు. 18 ఏళ్లుగా కప్ గెలవకున్నా తమకున్న లోయల్ ఫ్యాన్ బేస్ తో ఐపీఎల్ అంటేనే ప్రకంపనలు సృష్టించే ఆర్సీబీని ఈ స్థాయికి తీసుకువచ్చింది కేవలం కొహ్లీ అనే బ్రాండే. అలాంటి ఇద్దరు ఆఖరి తమ కెరీర్ లో ఎదురుబొదురు తలపడనున్నారా. ఈ రోజు జరిగే మ్యాచే ఈ ఇద్దరు లెజెండ్స్ మధ్య ఆఖరి ఫేస్ ఆఫా. ఈ సీజన్ లో అయితే ఇప్పటికే చెన్నై, ఆర్సీబీ ఓ సారి తలపడగా..చెన్నై చెపాక్ లో జరిగిన ఆ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచి 15ఏళ్ల చెన్నై రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పుడు చిన్నస్వామి బెంగుళూరు స్టేడియం వంతు. మరి సీఎస్కే పగ తీర్చుకుంటుందా చూడాలి. ఈ మ్యాచ్ తర్వాత ఈ ఇద్దరూ మరోసారి తలపడే అవకాశాలు లేవు. చెన్నై ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఇదే ఆఖరు. మరి ధోని నెక్ట్స్ సీజన్ ఆడతాడా లేదా క్లారిటీ లేదు. ఒకవేళ ఆడకపోతే మాత్రం ధోని, కొహ్లీలను ఒకే మ్యాచ్ లో చూడటం ఇదే ఆఖరు అవుతుంది. ఆ రకంగా చూస్తే ఈ ఇద్దరు యోధుల ఫ్యాన్స్ కి ఈ రోజు మ్యాచ్ చాలా ఎమోషనల్ మూమెంట్ అవుతుంది.





















