(Source: ECI/ABP News/ABP Majha)
RCB Into Playoffs | Virat Kohli | విరాట్ ఆటకు సలాం.. ఇక IPL కప్ పై ఆర్సీబీదే హుకుం..! | ABP Desam
RCB Into Playoffs | Virat Kohli | ఆర్సీబీ తరపునే కాదు.. టీం ఇండియా తరపున కూడా ఐపీఎల్ లో పిచ్చ ఫామ్ లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఈ రోజు ఆర్సీబీ ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టిందంటే దానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. అందులో నో డౌట్. 14 మ్యాచుల్లో 155కుపైగా స్ట్రైక్ రేట్ తో 708 పరుగులు కొట్టాడు. ఇందులో ఒక సెంచరీ. 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ దెబ్బతో రెండు ఐపీఎల్ సీజన్స్ లో 700కు పైగా స్కోర్ చేసిన తొలి ఇండియన్ బ్యాటర్ గా నిలిచాడు. ఫస్ట్ ఆఫ్ లో 120 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన కోహ్లీ అందరి చేత విమర్శలు ఎదుర్కున్నాడు. స్లోగా ఆడుతున్నాడు అందుకే ఆర్సీబీ ఓడిపోతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. దీంతో..సెకండ్ ఆఫ్ లో కోహ్లీ గేర్ మార్చాడు. ఆ తరువాత జరిగిన6 మ్యాచుల్లోనూ 170కిపైగా స్ట్రైక్ రేట్ తో దూసుకుపోయాడు. దెబ్బకు లెక్కలన్నీ మారిపోయాయి. అంతేకాదు..ఫీల్డింగ్ లోనూ మెరుపు రన్ అవుట్స్ తో బెంగళూరును గెలుపు గుర్రంగా మార్చాడు. మరోవైపు..కెప్టెన్ డూప్లెసిస్ కు మంచి సపోర్ట్ ఇస్తూ.. టీమ్ లో మంచి స్పోర్టివ్ స్పిరిట్ తీసుకురావడంలో కోహ్లీ సక్సెస్ అయ్యాడు. అందుకే నిన్న చెన్నైతో జరిగిన మ్యాచులో గెలవగానే కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు. అతడి కష్టానికి ప్రతిఫలం దక్కింది అన్నట్లుగా అనుష్క శర్మ కూడా సంతోషంలో మునిగిపోయింది. ఈ సాల కమ్ నమ్ దే స్లో గన్ కాస్త.. ఈ సారి కోహ్లీ కోసమైనా కప్ గెలవాలనే కసి ఫ్యాన్స్ లో కలిగింది. అనుకున్నట్లుగా ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది ఆర్సీబీ. తరువాత జరిగే క్వాలిఫైయర్స్ 2, ఎలిమినేటర్ మ్యాచ్ , ఫైనల్ ఇలా..మూడు మ్యాచుల్లోనూ అదరగొడితే .. ఆర్సీబీకి కప్ లేదు అన్న బ్రాండ్ పోయి.. ఆర్సీబీకి వుమెన్స్, మెన్స్ రెండు ఐపీఎల్ కప్స్ ఉన్నాయి రా సగర్వంగా ఆర్సీబీ ఫ్యాన్ చెప్పుకునే రోజు వస్తుంది. చూడాలి మరీ.. కోహ్లీ భాయ్ కష్టానికి... ఆవగింజ ఐనా అదృష్టం కలిసి వచ్చి... ఈ సాల ఐనా కప్ నమ్ దే అవుతుందో లేదో..!