అన్వేషించండి

Zimbabwe vs India 3rd T20I Match Highlights | జింబాబ్వేపై మూడో టీ20 లో 23 పరుగుల తేడాతో టీమిండియా జయభేరి | ABP Desam

 మొదటి టీ20 మ్యాచ్ లో పరాజయం పాలైన యువభారత్ ఆ ఓటమి నుంచి చాలా వేగంగా కోలుకుంది. రెండో టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ సెంచరీతో భారత్ ఘన విజయం సాధిస్తే మూడో టీ20 లో అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లోనూ యంగ్ ఇండియా సత్తా చాటింది. హరారేలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్...ఈ మ్యాచ్ లో యశస్వి జైశ్వాల్ తిరిగిరావటంతో గిల్ తో పాటు ఓపెనింగ్ దింపింది. జైశ్వాల్ 36పరుగులు చేసి గిల్ తో కలిసి ఫస్ట్ వికెట్ కే హాఫ్ సెంచరీ పార్ట్ నర్ షిప్ తో మంచి స్టార్టింగ్ ఇచ్చాడు. లాస్ట్ మ్యాచ్ సెంచరీ హీరో అభిషేక్ శర్మ ఈ మ్యాచులో 10పరుగులకే ఔట్ కాగా...కెప్టెన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి బౌండరీల మోత మోగించాడు. గిల్ 49బాల్స్ లో 7ఫోర్లు 3సిక్సర్లతో 66పరుగులు చేసి అదరగొడితే..గైక్వాడ్ 28 బాల్స్ లో 4ఫోర్లు 3 సిక్సర్లతో 49పరుగులు చేసి ఔటై తృటిలో హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 182పరుగులు చేసింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే టాప్ ఆర్డర్ ను భారత పేసర్లు ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ కుప్పకూల్చారు. వీరికి వాషింగ్టన్ సుందర్ కూడా తోడవటంతో ఓ దశలో జింబాబ్వే 39పరుగులకే 5వికెట్లు కోల్పోయింది. కానీ  డియోన్ మైర్స్ వీరోచితంగా పోరాడాడు. వికెట్ కీపర్ క్లైవ్ మదాండే తో కలిసి 6వికెట్ కు 67పరుగుల పార్ట్ నర్ షిప్ నెలకొల్పాడు. మదాండే 37పరుగులకు ఔట్ అవటంతో జింబాబ్వే ఆశలు నీరుగారాయి. డియోన్ మైర్స్ 48బంతుల్లో 7ఫోర్లు ఓ సిక్సర్ తో 65 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే 6వికెట్ల నష్టానికి 159పరుగులు చేసి మంచి ఫైటింగే ఇచ్చింది.  భారత్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2, ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ తీసుకోగా..4ఓవర్లలో కేవలం 15పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసి వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణించటంతో భారత్ 23 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించి ఐదు టీ20ల సిరీస్ 2-1తేడాతో ముందంజలో నిలిచింది.

క్రికెట్ వీడియోలు

Gautam Gambhir Reshuffling India's Batting Lineup |IND vs SL 2nd ODIలో బెడిసి కొట్టిన ఆర్డర్ మార్పు
Gautam Gambhir Reshuffling India's Batting Lineup |IND vs SL 2nd ODIలో బెడిసి కొట్టిన ఆర్డర్ మార్పు
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఏపీ క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ విడిచి వెళ్లమనడం సరికాదు: పవన్ కళ్యాణ్
ఏపీ క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ విడిచి వెళ్లమనడం సరికాదు: పవన్ కళ్యాణ్
AP Minister Anitha: రాజకీయ లబ్ధి కోసమే హైకోర్టులో జగన్‌ పిటిషన్‌, అంత సెక్యూరిటీ అవసరమా?: హోంమంత్రి అనిత
రాజకీయ లబ్ధి కోసమే హైకోర్టులో జగన్‌ పిటిషన్‌, అంత సెక్యూరిటీ అవసరమా?: హోంమంత్రి అనిత
Rythu Bharosa Scheme: రైతు రుణమాఫీ డేట్ ఫిక్స్, రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం- మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన
రైతు రుణమాఫీ డేట్ ఫిక్స్, రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం- మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన
Kamal Haasan: ‘బిగ్ బాస్’కు కమల్ బై.. బై.. కారణం ఇదేనట, మరి నెక్ట్స్ ఎవరు?
‘బిగ్ బాస్’కు కమల్ బై.. బై.. కారణం ఇదేనట, మరి నెక్ట్స్ ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తండ్రి తెచ్చిన రిజర్వేషన్లు.. కూతుర్ని పారిపోయేలే చేసింది | ABP DesamPakistan Behind Bangladesh Unrest | భారత్ దోస్తీని చెడగొట్టిన పాకిస్థాన్..! మోదీ ప్లాన్ ఏంటి..?Gautam Gambhir Reshuffling India's Batting Lineup |IND vs SL 2nd ODIలో బెడిసి కొట్టిన ఆర్డర్ మార్పుJoginder Sharma About Gautam Gambhir | గంభీర్ కెప్టెన్సీ పై జోగిందర్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: ఏపీ క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ విడిచి వెళ్లమనడం సరికాదు: పవన్ కళ్యాణ్
ఏపీ క్యాబ్ డ్రైవర్లను హైదరాబాద్ విడిచి వెళ్లమనడం సరికాదు: పవన్ కళ్యాణ్
AP Minister Anitha: రాజకీయ లబ్ధి కోసమే హైకోర్టులో జగన్‌ పిటిషన్‌, అంత సెక్యూరిటీ అవసరమా?: హోంమంత్రి అనిత
రాజకీయ లబ్ధి కోసమే హైకోర్టులో జగన్‌ పిటిషన్‌, అంత సెక్యూరిటీ అవసరమా?: హోంమంత్రి అనిత
Rythu Bharosa Scheme: రైతు రుణమాఫీ డేట్ ఫిక్స్, రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం- మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన
రైతు రుణమాఫీ డేట్ ఫిక్స్, రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం- మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన
Kamal Haasan: ‘బిగ్ బాస్’కు కమల్ బై.. బై.. కారణం ఇదేనట, మరి నెక్ట్స్ ఎవరు?
‘బిగ్ బాస్’కు కమల్ బై.. బై.. కారణం ఇదేనట, మరి నెక్ట్స్ ఎవరు?
Amazon India Head Resigns: అమెజాన్ ఇండియా చీఫ్ రాజీనామా, త్వరలో కొత్త కంపెనీలోకి మనీష్ తివారీ
అమెజాన్ ఇండియా చీఫ్ రాజీనామా, త్వరలో కొత్త కంపెనీలోకి మనీష్ తివారీ
Shanto Khan: ఏకంగా హీరోను, అతడి తండ్రిని కొట్టి చంపేసిన జనాలు - అసలు ఏం జరిగింది?
ఏకంగా హీరోను, అతడి తండ్రిని కొట్టి చంపేసిన జనాలు - అసలు ఏం జరిగింది?
YS Jagan: చంద్రబాబు, టీడీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు - జగన్ సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు, టీడీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు - జగన్ సంచలన వ్యాఖ్యలు
Producer SKN: హీరోగా మారనున్న ‘బేబీ‘ నిర్మాత, ఆ క్యారెక్టర్ లో శాడిజం షేడ్స్ ఉంటాయన్నSKN
హీరోగా మారనున్న ‘బేబీ‘ నిర్మాత, ఆ క్యారెక్టర్ లో శాడిజం షేడ్స్ ఉంటాయన్నSKN
Embed widget