Allu Arjun Sandhya Theatre Pushpa 2 | పుష్ప 2 ప్రీమియర్ కోసం సంధ్యా థియేటర్ కు బన్నీ | ABP Desam
పుష్ప 2 జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ మరోసారి తనదైన శైలిలో ఆకట్టుకుంటూ, ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడంలో ఎలాంటి కాంప్రమైజ్ చేయలేదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో, ప్రీమియర్స్ కోసం ఫ్యాన్స్ భారీగా తరలివచ్చి పుష్ప 2 విడుదలకు ఉత్సవ వాతావరణం సృష్టించారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బన్నీ భాయ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో మళ్లీ ఒకసారి స్పష్టమైంది. అల్లు అర్జున్ తన అభిమానులతో కలిసి సినిమా చూడాలనుకోవటం ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం కలిగించింది. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్‌లో ఆయన ప్రత్యేకంగా హాజరై అభిమానులతో కలిసి ప్రీమియర్ చూసారు.
అయితే, బన్నీని చూడటానికి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు థియేటర్ వద్ద పెద్ద ఎత్తున గుమిగూడటంతో పోలీసులు వారి కదలికలను నియంత్రించడంలో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒక దశలో అభిమానుల ఆవేశం ఉధృతంగా మారి గేటు విరగగొట్టడానికి దారి తీసింది. పరిస్థితి నియంత్రించేందుకు పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.
పుష్ప 2 రూలింగ్ ఎలా ఉండబోతుందనేది ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి రేపగా, ఈ ఘన ఆరంభం పుష్ప సీక్వెల్‌పై అంచనాలను మరింతగా పెంచింది.