Shinde Suspense in Maharastra | మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ఖరారు..కానీ | ABP Desam
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ కే బీజేపీ ఓటు వేసింది. మహాయుతి కూటమిగా శివసేన, ఎన్సీపీ పార్టీలతో కలిసి బరిలోకి దిగిన బీజేపీ...అధికారాన్ని కైవసం చేసుకున్నా..సీఎం పీఠంపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. శివసేనను చీల్చి సీఎం పీఠాన్ని దక్కించుకున్న ఏక్ నాథ్ శిందేకు ఈసారి నిరాశ ఎదురైంది. 132 స్థానాలు గెల్చుకున్న బీజేపీకే సీఎం పీఠం దక్కాలని బీజేపీ తేల్చి చెప్పటంతో పాటు శివసేనను చీల్చిన శిందేకు, ఎన్సీపీ ని చీల్చిన అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవులను ఆఫర్ చేసింది బీజేపీ. పవార్ ఇందుకు ఓకే చెప్పగా...ఏక్ నాథ్ శిందే మాత్రం తన నిర్ణయాన్ని సాయంత్రం తర్వాత చెబుతానంటూ ప్రెస్ మీట్ లో బాంబు పేల్చారు. పైగా శిందేలా తను వెయిట్ చేయనని తను డిప్యూటీ సీఎం తనకు ఓకే అని అజిత్ పవార్ చెప్పారు. దీనికి ప్రెస్ మీట్ లోనే కౌంటర్ ఇచ్చారు ఏక్ నాథ్ శిందే. పవార్ కు ఉదయం, సాయంత్రం వేర్వేరు ప్రమాణస్వీకారాలు చేసిన అనుభవం ఉందంటూ గతంలో ఆయన పార్టీలు చీల్చిన ఘటనను గుర్తు చేశారు.