Kohli on Bengaluru Stampede | 2 నెలల తర్వాత బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పందించిన కోహ్లీ | APB Desam
బెంగళూరు తొక్కిసాట ఘటనపై విరాట్ కోహ్లీ ఎట్టకేలకి రియాక్ట్ అయ్యాడు. ఘటన జరిగి 2 నెలలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు కోహ్లీ రియాక్ట్ కావడంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ.. ఐపీఎల్ టైటిల్ గెలిచి బెంగళూరు అభిమానులకి అంతులేని ఆనందాన్నిచ్చింది. ఈ విజయాన్ని అభిమానులతో పంచుకోవడానికి జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసింది ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్. అయితే, వేడుకలోకి వెళ్లేందుకు అభిమానులు ఒక్కసారిగా తోసుకురావడంతో తీవ్రమైన తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆర్‌సీబీ ఫ్రాంచైజీతో పాటు విరాట్ కోహ్లీ కూడా సైలెంట్ అయిపోవడంతో ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. ఇక కోహ్లీ భార్యతో కలిసి లండన్ వెళ్లిపోవడంపై కొంతమంది ఫ్యాన్స్ కోప్పడ్డారు కూడా. ‘నీ ఫ్యాన్స్ ఇక్కడ చనిపోతుంటే నువ్వు లండన్ పారిపోతావా?’ అంటూ ట్రోల్ కూడా చేశారు. అయితే ఈ మధ్యనే జూన్ 4 తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ ఓ పోస్ట్ చేసి.. ఆర్సీబీ కేర్స్ అనే కొత్త ప్రాజెక్ట్ తెస్తున్నామని ప్రకటించింది. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా 2 నెలల తర్వాత బెంగళూరు ఘటనపై రియాక్ట్ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా తమ బాధని తెలియజెప్పేలా ఓ పోస్ట్ చేశాడు. ‘‘జూన్ 4న హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. మా ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత సంతోషకరమైన క్షణం విషాదంగా మారింది. ప్రాణాలు కోల్పోయిన అభిమానుల కుటుంబాల కోసం, గాయపడిన వారికి కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నాం. వారి కోసం ప్రార్థిస్తున్నాం. మీకు కలిగిన నష్టం మాలో భాగం. ఇక నుంచి జాగ్రత్తగా.. గౌరవంగా, మరింత బాధ్యతతో కలిసికట్టుగా ముందుకు సాగుదాం.'అని విరాట్ అన్నాడు కోహ్లీ. అయితే కోహ్లీ చేసిన ఈ పోస్ట్‌పై కొంతమంది ఫ్యాన్స్.. ఆనందం వ్యక్తం చేస్తుంటే.. ఇంకొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు. కోహ్లీకి సపోర్ట్‌గా ఉన్నవాళ్లు.. ‘కోహ్లీ.. నీ పోస్ట్ కొంత ఆలస్యంగా వచ్చినా, అది మా హృదయాలను ఎంతగానో కదిలించింది.’ అని అంటుంటే.. విమర్శించేవాళ్లు మాత్రం.. ‘ఈ పోస్ట్ పెట్టడనికి నీకు 2 నెలలు పట్టిందా? ఆర్సీబీ గెలిచిందనే ఆనందం కంటే నిన్ను చూడాలనే కోరికతో వచ్చిన ఫ్యాన్సే ఎక్కువ. వాళ్లకోసం ఒక్క పోస్ట్ కూడా చేయకుండా లండన్ పారిపోయావ్’ అంటూ మండిపడుతున్నారు. మరి కోహ్లీ ఇన్ని రోజుల తర్వాత రియాక్ట్ కావడంపై మీ ఒపీనియన్ ఏంటి?





















