Rahul Dravid Refuses BCCI Extra Bonus |బీసీసీఐ 5 కోట్ల ఆఫర్ ద్రావిడ్ కు నచ్చలేదట..! | ABP Desam
పిలిచి మరి 5 కోట్లు ఇస్తానంటే... వద్దు వద్దు నాకు 2న్నర కోట్లే కావాలని ఎవరైనా అంటారా..? కానీ, రాహుల్ ద్రావిడ్ అన్నారు. ఎందుకంటే.. టీ 20 ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా బీసీసీఐ 125 కోట్ల నజరానా ప్రకటించింది. అందులో 15 మంది ఆటగాళ్లకు, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు ఒక్కొక్కరికి 5 కోట్లు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే ద్రావిడ్ తన నగదు బహుమతిని రూ. 2.5 కోట్లకు తగ్గించాలని బీసీసీఐని కోరినట్లు జాతీయ వార్త సంస్థలు వెల్లడించాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లతో పోల్చితే తనకు ఎక్కువ డబ్బు తీసుకోవాలనే ఉద్దేశం లేదని... వారితో సమానంగా తనకు కూడా రూ. 2న్నర కోట్లే ఇవ్వాలని బీసీసీఐని ద్రావిడ్ కోరినట్లు తెలుస్తోంది.తాము ద్రావిడ్ మనోభావాలను గౌరవిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇప్పుడే కాదు..! 2018లో భారత్ అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న సందర్భంగా అప్పుడు జట్టుకు ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ ఇదే రూల్ ను ఫాలో అయ్యాడు.