PVR Prashanth Team India Manger | ఆసియా కప్ లో టీమిండియా మేనేజర్ పీవీఆర్ ప్రశాంత్ | ABP Desam
బీసీసీఐ లో ఆంధ్ర క్రికెట్ ప్రాభవం మళ్లీ మొదలైంది. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సారథ్యంలో నడుస్తున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు బీసీసీఐ సముచిత గౌరవం కల్పించింది. ఏసీఏకు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన అనుభవం ఉన్న పీవీఆర్ ప్రశాంత్ ను ఆసియాకప్ లో టీమిండియాకు మేనేజర్ గా ఎంపిక చేసింది. పీవీఆర్ ప్రశాంత్ కు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా గట్టిగా ఉంది. ఆయన తండ్రి భీమవరం ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులు. అంతే కాదు గంటా శ్రీనివాసరావుకు పీవీఆర్ ప్రశాంత్ స్వయానా అల్లుడు. తండ్రి,మామయ్యతో కలిసి మొన్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కోసం ప్రచారం కూడా చేశారు ప్రశాంత్. ఇప్పుడు యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28వరకూ జరిగే ఆసియాకప్ లో టోర్నీలో టీమిండియాకు మేనేజర్ గా రిప్రజెంట్ చేయనున్నారు ప్రశాంత్. 1997లో టీమ్ ఇండియా వెస్టిండీస్ పర్యటకు వెళ్లినప్పుడు డీవీ సుబ్బారావు అనే వ్యక్తి అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గా వ్యవహరించారు. ఆ తర్వాత 28ఏళ్ల తర్వాత ఇప్పుడు మరో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వ్యక్తి టీమిండియాకు మేనేజర్ గా వ్యవహరించనున్నాడు. తన కుమారుడు టీమిండియా టూర్ మేనేజర్ గా ఎంపికైన వార్త తెలియగానే భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు జనసేన కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.





















