Ishan Kishan 76 vs NZ Second T20 | మెరుపు ఇన్నింగ్స్ తో కమ్ బ్యాక్ ఘనంగా చాటుకున్న ఇషాన్ | ABP Desam
అసలు నెల రోజుల క్రితం వరకూ టీమిండియాలోనే లేడు. టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ చేసే వరకూ మళ్లీ తిరిగి భారత్ కి ఆడతాడని కూడా ఎవరూ అనుకోలేదు. స్వీయ తప్పిదమో లేదా నిజంగా ప్రాబ్లమో మెంటల్ హెల్త్ బాగోలేదంటూ రెండేళ్ల క్రితం టీమ్ నుంచి తప్పుకున్న ఇషాన్ కిషన్...తన కమ్ బ్యాక్ ను నిన్న న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో ఘనంగా చాటుకున్నాడు. ముందు టీమిండియాలోకి తనను తీసుకునేలా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ, విజయ్ హజరే ట్రోఫీల్లో దుమ్మురేపిన ఇషాన్ కిషన్...తన ఆటతో మళ్లీ టీమ్ లోకి వచ్చి నిన్న తన వరల్డ్ కప్ సెలక్షన్ ఎందుకు న్యాయమో నిరూపించేలా ఫైరీ హాఫ్ సెంచరీ బాదేశాడు. అసలు ఇషాన్ కిషన్ ఇంటెన్షన్ చూడాలి. టీమిండియా 209 పరుగులు చేయాలి. కళ్ల ముందే 2పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా. బీభత్సమైన ఫామ్ లో ఉన్న అభిషేక్, సీనియర్ బ్యాటర్ సంజూ కళ్ల ముందే వెళ్లిపోయిన మన పాకెట్ డైనమో ఇషాన్ కిషన్ అదరలేదు బెదరలేదు. బంతి బ్యాట్ కి దొరికితే చాలు బౌండరీకే పంపుతా అన్నంత స్థాయిలో రెచ్చిపోయాడు. 32 బాల్స్ లో 11 ఫోర్లు 4 సిక్సర్లతో 76 పరుగులు చేసిన ఇషాన్ కిషన్...237 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లే కంప్లీట్ అయ్యేలోపు హాఫ్ సెంచరీ బాదేసి...209 టార్గెట్ ను కూడా కేక్ వాక్ చేసి పారేశాడు. నిన్న మ్యాచ్ అయ్యాక కూడా అదే మాట్లాడాడు...ఇకపై నేను కాదు మాట్లాడేది నా ఆటే అని. అంటే తన ఫామ్ కి తోడు మెంటల్ గా అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు ఇషాన్. చూడాలి ఈ సిరీస్ లో మిగిలిన మూడు మ్యాచుల్లో ఈ ఝార్ఖండ్ నయా డైనమైట్ ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే టీ20 వరల్డ్ కప్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ వికెట్ కీపర్ గా సంజూను రీప్లేస్ చేసినా ఆశ్చర్యం లేదు.





















