అన్వేషించండి

Ind vs Pak Asia Cup 2025 Match | పాకిస్తాన్‌ని చిత్తుగా ఓడించబోతున్న టీమిండియా | ABP Desam

ఆసియా కప్ 2025 సీజన్లో భారత్, పాకిస్తాన్ తొలిసారి తలపడబోతున్నాయి. సెప్టెంబర్ 14న ఈ రెండు జట్ల మధ్య జరపబోతున్న మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పెహల్గామ్ ఎటాక్, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగడానికే వీల్లేదన్న ఫ్యాన్స్ కూడా.. ఇప్పుడు ఎలాగైనా ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని ఇండియా చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని బలంగా కోరుకుంటున్నారు. అటు పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా ఇండియా టీమ్‌ని ఓడించి పగ తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్నారు. అంటే రెండు దేశాల ఫ్యాన్స్.. ఈ మ్యాచ్‌‌ని.. జస్ట్ క్రికెట్ మ్యాచ్‌లా కాకుండా ఓ యుద్దంలా ఫీల్ అవుతున్నారన్నమాట. అయితే ఒక్కసారి రెండు టీమ్‌ల మధ్య క్రికెట్ హిస్టరీ చూసుకున్నా.. లేదంటే ఫామ్ పరంగా అంచనా వేసినా.. పాకిస్తాన్‌కి టీమిండియా ఇంకోసారి చుక్కలు చూపించబోతోందని, చిత్తు చిత్తుగా ఓడించి చక్రాల కుర్చీలో ఇంటికి పంపించబోతోందని అర్థమవుతోంది. నిజానికి ఈ టోర్నీకే టీమిండియా హాట్ ఫేవరేట్‌. ఒకవైపు టీ20ల్లో టీమిండియా వరల్డ్ ఛాంపియన్‌గా ఉండగా.. పాకిస్థాన్ 8వ స్థానంలో ఉంది. అంతేకాకుండా పాక్‌లో సీనియర్ ఆటగాళ్లు ఒక్కళ్లు కూడా లేరు. ఆ జట్టు పూర్తిగా కుర్రాళ్లతో ఉంది. మరోవైపు భారత్.. వరల్డ్ బెస్ట్ టీ20 ప్లేయర్లతో భీకరంగా కనిపిస్తోంది. దానికి తోడు సియా కప్ , టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్.. ఏదీ తీసుకున్నా పాక్‌పై భారత్‌దే పై చేయి. ముఖ్యంగా ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌‌దే పూర్తి ఆధిపత్యం. 1984లో ఈ టోర్నీ మొదలైనప్పటి నుంచి అన్ని సీజన్లలో కలిపి భారత్, జట్లు 18 సార్లు తలపడగా.. భారత్ 10 సార్లు గెలిస్తే.. పాకిస్థాన్ 6 సార్లు గెలిచింది. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. ఇక టీ20 ఫార్మాట్లో 3 సార్లు తలపడగా.. భారత్ రెండు సార్లు.. పాకిస్థాన్ ఒకసారి గెలిచింది. ఈ లెక్కల్ని బట్టే.. ఈ సారి సీజన్లో కూడా పాకిస్తాన్‌కి టీమిండియా చుక్కలు చూపించడం పక్కా అనిపిస్తోంది. అయితే టీ20 ఫార్మాట్‌లో ఏ జట్టును తక్కువ అంచనా వేయలేం. అంతేకాకుండా భారత్-పాక్ మ్యాచ్ అంటే భారీ ఒత్తిడి ఉంటుంది. మరి ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడగలిగిన జట్టే చివరికి విజయం సాధిస్తుంది. మరి మీరేం అంటారు? ఈ మ్యాచ్‌లో టీమిండయా గెలిచే ఛాన్స్ ఉందంటారా..? కామెంట్ చేసి చెప్పండి.

క్రికెట్ వీడియోలు

Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
APSRTC Income: ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
Nitin Navin:
"మీరే బాస్, నేను పార్టీ కార్యకర్తను" నితిన్ నవీన్‌తో ప్రధాని మోదీ సంభాషణ వైరల్
Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ABP Premium

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy at WEF:
"మేధస్సే సమస్య మేధస్సే పరిష్కారం" ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ సీఎం కీలక కామెంట్స్
APSRTC Income: ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
Nitin Navin:
"మీరే బాస్, నేను పార్టీ కార్యకర్తను" నితిన్ నవీన్‌తో ప్రధాని మోదీ సంభాషణ వైరల్
Nara Lokesh in Davos: ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
ఏపీలో RMZ లక్ష కోట్ల పెట్టబడి ప్రతిపాదనలు - దావోస్‌లో మంత్రి లోకేష్ సమక్షంలో ప్రకటన
Harish Rao SIT investigation : ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
ఏడున్నర గంటల పాటు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం - సిట్ సంచలన విషయాలు రాబట్టిందా?
Durgam Cheruvu ABP Desam Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Donald Trump Greenland: ట్రంప్ గ్రీన్‌ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!
ట్రంప్ గ్రీన్‌ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
Embed widget