Gulbadin Naib Slow Down Afg vs Ban Match | ఒక్క గెలుపు కోసం ఎన్ని కష్టాలొచ్చాయి సర్ కాబూలీలకు | ABP
ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులను ఆటతోనే కాదు...ఆస్కార్ రేంజ్ ఫర్ ఫార్మెన్స్ లతోనూ ఆకట్టుకుంది. ఒక్క గెలుపు కోసం కాబూలీలు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వికెట్లు తీయటం, బంగ్లా బ్యాటర్లు కొట్టే పరుగులు ఆపటమే కాదు...అంతకు మించిన నటనతోనూ కళ్లు చెమర్చే రేంజ్ ఫర్ ఫార్మెన్స్ ఇచ్చారు. బంగ్లా దేశ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 11.5 బంతి దగ్గర జరిగింది ఈ ఘటన. అప్పడుప్పుడే సన్నగా వర్షం పడుతోంది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఆఫ్గాన్ రెండు పరుగుల ముందంజలో ఉంది. అలాంటి టైమ్ లో ఆ బాల్ వేస్తే బంగ్లా బ్యాటర్ ఫోరు కానీ డబుల్ కానీ కొడితే...వర్షం పడి మ్యాచ్ ఆగినా విన్నింగ్ బంగ్లా దేశ్ ను వరిస్తుంది. అందుకే ఆఫ్గాన్ కోచ్ జొనాథన్ ట్రాట్ ఓ వ్యూహంతో వచ్చారు. డగౌట్ నుంచి వర్షం పడేలా ఉంది మ్యాచ్ జరగకుండా స్లో డౌన్ చేయండి అన్నాడు. ఆయన ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ తో టైమ్ పాస్ చేయండి అని చెప్పి ఉండొచ్చు. కానీ ఆఫ్గాన్ ఆటగాడు గుల్బద్దీన్ నయిూబ్ తనలోని యాక్టింగ్ ఎబిలిటీస్ కి పని చెప్పాడు. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న గుల్బద్దీన్ బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా పడిపోయాడు. హామ్ స్ట్రింగ్ పట్టేసినట్లు విలవిలాడిపోయాడు. వెంటనే మెడికల్ స్టాఫ్ వచ్చి గుల్బద్దీన్ ను పెవిలియన్ కు తీసుకెళ్లారు. ఫలితంగా మ్యాచ్ ఓ రెండు మూడు నిమిషాలు ఆగింది. ఈలోగా వర్షం పెద్దదైందని అంపైర్లు మ్యాచ్ ను ఆపారు. ఇదే ఆప్గాన్ కి కావాల్సింది