Gill on Fight with Pitch Curator | పిచ్ క్యురేటర్ గొడవపై స్పందించిన గిల్ | ABP Desam
ద ఓవల్ పిచ్ క్యూరెటర్ లీ ఫోర్టీస్ పై భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభమాన్ గిల్ ఫైరయ్యాడు. ఈ టూర్ లో నాలుగు టెస్టులు ఆడినప్పటికీ, ఫోర్టీస్ లా వేరే మైదాన క్యూరెటర్ ప్రవర్తించ లేదని పేర్కొన్నాడు. పిచ్ ను పరిశీలిస్తున్న భారత బృందం దగ్గరికి వచ్చిన ఫోర్టిస్.. పిచ్ ను రెండున్నర మీటర్ల దూరం నుంచి పరిశీలించాలని సూచించాడు. అలాగే గ్రౌండ్ మధ్యలోకి కూలింగ్ బాక్స్ తీసుకు రావద్దని కాస్త రూడ్ గా ప్రవర్తించాడు. దీంతో భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్, ఫోర్టీస్ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. గంభీర్ కాస్త ఘాటూగానే బదులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలైంది.
ఇక తాజాగా ఈ ఘటనపై గిల్ మాట్లాడుతూ.. తనకు తెలిసినంత వరకు పిచ్ ను రెండున్నర మీటర్ల దూరం నుంచి పరిశీలించాలనే రూల్ లేదని అన్నాడు. తాము మాములు షూలను మాత్రమే ధరించామని, ఫోర్టిస్ ఇలా చెప్పడం సరికాదని వ్యాఖ్యానించాడు. స్పైక్స్ ఉన్న షూలను వేసుకున్నట్లయితే పిచ్ పాడయ్యే అవకాశం ఉంటుందని, తాము మాత్రం రబ్బర్ స్పైక్స్ లేదా బేర్ ఫూట్ తోనే ఉన్నామని, ఫోర్టిస్ ఇలా ఎందుకు చెప్పాడో అర్థం కాలేదని తెలిపాడు.అలాగే ఇప్పటివరకు ఆడిన నాలుగు టెస్టుల వేదికల క్యూరెటర్లు ఇలా ప్రవర్తించ లేదని గుర్తు చేశాడు. ఇక పిచ్ వివాదంపై స్పందించేందుకు బెన్ స్టోక్స్ నిరాకరించాడు. తనకు అసలు ఈ ఇష్యూ గురించి తెలియదని, తను అక్కడ లేనని మాట దాటేశాడు.





















