Ben Stokes Rishabh Pant Injuries | సబ్ స్టిట్యూట్స్ ను పెట్టుకోవటంపై బెన్ స్టోక్స్ మండిపాటు | ABP Desam
భారత్ 11మందితోనే క్రికెట్ ఆడాలి..కానీ 12మందితో ఆడుతోంది అన్నట్లుగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కామెంట్స్ చేశాడు. మాంచెస్టర్ టెస్టు ను భారత్ డ్రా చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన బెన్ స్టోక్స్...పంత్ గాయంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఏదైనా మ్యాచ్ ఆడేప్పుడు 11మందితో బరిలోకి దిగుతాం. గాయాలు అనేవి గేమ్ లో భాగం మాత్రమే. మరి అలాంటిది ఈ సబ్ స్టిట్యూట్స్ ను పెట్టుకుని ఆడించుకోవటం...మళ్లీ దానిపై చర్చ ఇదంతా రెడిక్యులస్ అన్నాడు బెన్ స్టోక్స్. ఈ సబ్ స్టిటిట్యూట్స్ వల్ల కావాల్సినన్నీ లూప్ హోల్స్ ఉంటున్నాయన్నది బెన్ స్టోక్స్ అభిప్రాయం. మనోడి బాధ ఏంటంటే మూడో టెస్టు లో చేతికి గాయం కావటంతో రిషభ్ పంత్ బ్యాటింగ్ మాత్రమే చేశాడు. కీపింగ్ ధృవ్ జురెల్ చూసుకున్నాడు. అలా రెండు ఇన్నింగ్స్ లోనూ పంత్ బ్యాటింగ్ మాత్రమే చేయటం...కీపింగ్ అంతా సబ్ స్టిట్టిట్యూట్ గా ధృవ్ జురెల్ చేయటం స్టోక్స్ నచ్చలేదు. పోనీ నాలుగో టెస్టులో అన్నా ఓకే అనుకుంటే పంత్ కాలికి గాయమైంది. కాలు బాగా స్వెల్లింగ్ వచ్చేయటంతో రిటైర్డ్ ఇచ్చి తర్వాత మళ్లీ వచ్చి అదే దెబ్బ తగలిన కాలితో ఆడి హాఫ్ సెంచరీ కొట్టాడు పంత్. ఇండియా బౌలింగ్ చేస్తున్నప్పుడు కీపింగ్ బాధ్యతలను మళ్లీ ధృవ్ జురెల్ చూసుకున్నాడు. ఐదో రోజు గ్రౌండ్ కి స్టిక్స్ తో వచ్చాడు పంత్. జడ్డూ, సుందర్ సెంచరీలు కొట్టారు కాబట్టి సరిపోయింది లేదంటే అలాగే మళ్లీ వచ్చి బ్యాటింగ్ చేద్దామనేదే పంత్ ప్లాన్. ఇదే విషయంపై స్టోక్స్ అభ్యంతరం చెబుతున్నాడు. ఒకరికి గాయమైతే పదిమందితోనే టీమ్ ఆడాలి కానీ ఇలా సబ్ స్టిట్ట్యూట్ అనే ఆప్షన్ ఉండటం వల్ల భారత్ లబ్ది పొందుతుంది అనేది మనోడి ఆవేదన. సర్లే పంత్ నాలుగో టెస్టు తర్వాత సర్జరీ కోసం భారత్ తిరిగి వచ్చేస్తున్నాడు. ఐదో టెస్టు పంత్ స్థానంలో జగదీశన్ తీసుకుంది టీమిండియా.





















