Asia Cup 2025 Team India Records | యూఏఈతో మ్యాచ్‌లో 4 రికార్డులు సృష్టించిన టీమిండియా | ABP Desam
ఆసియా కప్ 2025లో ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే టీమిండియా అద్భుతమైన విక్టరీ సాధించడనమే కాకుండా.. 4 క్రికెట్ రికార్డులని కూడా బద్దలు కొట్టింది. అందులో ఫస్ట్ ది.. ఆసియా కప్‌లో రెండు సార్లు అపోనెంట్‌ని 60 పరుగుల కంటే తక్కువ స్కోర్లకే అవుట్ చేసిన టీమ్‌గా టీమిండియా రికార్డ్ సృష్టించింది. ఈ మ్యాచ్‌లో యూఏఈని 13.1 ఓవర్లలో 57 రన్స్‌కే ఆలౌట్ చేసిన టీమిండియా..9 వికేట్ల తేడాతో గెలిస్తే.. 2023 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకని 15.2 ఓవర్లలో 50 రన్స్‌కే ఆలౌట్ చేసి.. ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలిచింది. నెక్ట్స్ రికార్డ్.. ఓ టీ20 మ్యాచ్‌లో అత్యధిక బంతులు మిగిలుండగానే మ్యాచ్ గెలిచేసిన టీమ్‌గా కూడా భారత జట్టు రికార్డులకెక్కింది. యూఏఈ ఇచ్చిన 58 రన్స్ టార్గెట్‌ని ఛేజ్ చేస్తూ.. కేవలం 4.2 ఓవర్లలోనే 60 రన్స్ కొట్టి మ్యాచ్ గెలిచేసింది. అంటే 81 బంతులు మిగిలుండగానే గెలిచేసిందన్నమాట. ఓ టీ20 మ్యాచ్‌లో ఇన్ని బంతుల తేడాతో గెలవడం ఇదే ఫస్ట్ టైం. మూడో రికార్డ్ ఏంటంటే.. ఆసియా కప్‌లోనే కాదు.. మొత్తం టీ20 చరిత్రలోనే అపోనెంట్ ఇచ్చిన టార్గెట్‌ని 4.2 ఓవర్లు అంటే 26 బంతుల్లో ఛేజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అంటే టీ20ల్లో మోస్ట్ ఫాస్టెస్ట్ ఛేజింగ్ చేసిన రికార్డ్ ఇప్పుడు టీమిండియా పేరుమీద ఉందన్నమాట. ఇక నాలుగోది అండ్ ఫైనల్ రికార్డ్. ఇది ఇండివిడ్యువల్ రికార్డ్. ఇది సాధించింది టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. 58 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగడంతో అభిషేక్ శర్మకి భారీ షాట్లు ఆడటానికి ఫ్రీ టికెట్ దొరికినట్లైంది. దాంతో తాను ఫేస్ చేసిన ఫస్ట్ బాల్‌నే బౌండరీ దాటించాడు అభిషేక్. ఈ సిక్స్‌తో ఓ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఎదుర్కొన్న ఫస్ట్ బాల్‌నే సిక్స్‌గా కొట్టిన నాలుగో బ్యాటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. ఇలా మొత్తం 4 వరల్డ్ రికార్డులని ఒకే మ్యాచ్‌లో సృష్టించింది టీమిండియా. మరి ఆదివారం పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో కూడా మన టీమ్ ఇలాంటి ఇంకెన్నో రికార్డులు రిజిస్టర్ చేయాలని కోరుకుందాం.





















