Sri Lankan Airlines Ramayana Ad | రామాయణంపై శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ యాడ్ | ABP Desam
శ్రీలంకలో రామాయణానికి సంబంధించిన ఎన్నో చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయంటారు హిస్టారియన్స్. శ్రీలంక అంటేనే అప్పటి లంక అని కూడా చెబుతారు. ఈ క్రమంలోనే..శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విడుదల చేసిన ఓ యాడ్ భారతీయులను తెగ అట్రాక్ట్ చేస్తోంది. హిందూ పురాణమైన రామాయణాన్ని రిఫరెన్స్‌గా తీసుకుంటూ అక్కడి టూరిజంని ప్రమోట్ చేసుకుంది ఎయిర్‌లైన్స్. 5 నిముషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రామాయణంతో సంబంధం ఉన్న కీలక ప్రాంతాల గురించి వివరించారు. రావణ్ గుహల గురించి ప్రస్తావించారు. రావణుడు సీతను అపహరించి ఇక్కడే ఉంచాడని చెబుతారు. దీంతో పాటు అశోక వాటిక సీతా టెంపుల్‌నీ ఈ యాడ్‌లో చూపించారు. వీటితో పాటు రామసేతు గురించి కూడా చెప్పారు. ఓ బామ్మ తన మనవడికి వివరిస్తున్నట్టుగా ఉన్న ఈ వీడియోలో వానర సైన్యం నిర్మించిన రామసేతు ప్రస్తావన వచ్చింది. "ఈ వంతెనని ఇప్పటికీ చూడొచ్చా నానమ్మ" అని పిల్లాడు అడగ్గా...అవును అని సమాధానమిచ్చింది ఆ పెద్దావిడ.
అంతే కాదు. రామాయణంలో ఉన్నదంతా నిజమే. అప్పటి లంకే..మన శ్రీలంక అని చెబుతుంది. ఇలా..తమ పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేసుకోవడంతో పాటు..రామాయణాన్నీ ప్రస్తావించి శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు గూస్‌బంప్స్ వచ్చాయంటూ కామెంట్ చేస్తున్నారు. గతేడాది భారత్, శ్రీలంక మధ్య కీలక ఒప్పందం కుదిరింది. శ్రీలంకలోని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు వీలుగా Ramayana Trail Project కోసం చేతులు కలిపాయి.