Quantum Valley Chandrababu Naidu's Next Big Vision | క్వాంటమ్ వ్యాలీ గురించి ఫుల్ డీటైల్స్ ఇదిగో | ABP Desam
క్వాంటమ్, క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ వ్యాలీ..మీరు చూస్తే గడచిన ఏడాది కాలంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈ పదాన్ని పలుకుతూనే ఉన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని క్రియేట్ చేయాలనేది ఆయన జీవిత కాల కోరిక. సరే చంద్రబాబు సంగతి అలా పక్కన పెడితే..అసలు క్వాంటమ్ అంటే ఏంటీ...ఈ టెక్నాలజీ ఎలా రేపటి ప్రపంచాన్ని మార్చబోతోంది. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తే మనకు మన దేశానికి కలిగే లాభం ఏంటీ..ఈ వారం టెక్నలాజియాలో మాట్లాడుకుందాం.
ముందుగా క్వాంటమ్ అనే పదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ Atoms తెలుసుగా..అణువులు. ఆ అణువులు కంటే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి వాటికి సంబంధించిన సైన్సే క్వాంటమ్ సైన్స్. అణువుల కంటే చిన్నవాటిని సబ్ అటామిక్ పార్టికల్స్ అంటారు. అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ లాంటివి..ఇంకా చిన్న వి కూడా క్వార్క్స్ అని..ఇప్పుడు మరీ మనం డెప్త్ కి వెళ్తే కష్టం కానీ ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ తో ఆగిపోదాం. ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి ఎలా ప్రవర్తిస్తున్నాయి అనే అధ్యయనాన్ని క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు. సబ్ అటామిక్ పార్టికల్స్ ప్రవర్తనను ఆధారం చేసుకునే క్వాంటమ్ కంప్యూటర్లను తయారు చేస్తారు.
అంటే నార్మల్ గా మన ఇళ్లల్లో ఉండే కంప్యూటర్లు బిట్స్ పై పనిచేస్తాయి. బిట్స్ అంటే 0,1 అలా మన అడిగిన ప్రశ్నలను బైనరీ కోడ్ లోకి కన్వర్ట్ చేసుకుని మనకు ఆన్సర్స్ ఇస్తాయి. ఇది నార్మల్ కంప్యూటర్. అదే క్వాంటమ్ కంప్యూటర్స్ అయితే 0,1 రెండూ ఎట్ ఏ టైమ్ లో ఉన్నట్లు బిహేవ్ చేస్తాయి. అర్థం కాలేదు కదా చేతిలో ఓ రూపాయి కాయిన్ తీసుకుని గాల్లోకి టాస్ చేయండి. ఏమవుతుంది బొమ్మ బొరుసూ రెండు చూపిస్తూ తిరుగుతుంది కదా అది గాల్లో ఉన్నప్పుడే నీకు కనిపిస్తుంది బొమ్మా, బొరుసా అంటే ఏం చెప్తావ్ రెండూ కనిపిస్తున్నాయి కదా. ఎగ్జాట్లీ అలాంటి పొజిషన్ లోనే క్వాంటమ్ కంప్యూటర్లు కూడా పని చేస్తాయి. దాన్ని క్వాంటమ్ పరిభాషలో సూపర్ నేచురాలిటీ అంటారు. ఈ సూపర్ నేచురాలిటీ కలిగి ఉన్న పార్టికల్స్ ని క్వాంటమ్ బిట్స్ అంటారు. ఈ క్వాంటమ్ బిట్స్ ను ఆధారం చేసుకునే క్వాంటమ్ కంప్యూటర్లను తయారు చేస్తారు.
సాధారణ కంప్యూటర్ తన జీవితాకాలంలో చేసే లెక్కలను, ఓ సూపర్ కంప్యూటర్ ఏళ్ల తరబడి చేసే లెక్కలను ఈ క్వాంటమ్ బిట్స్ తో పనిచేసే క్వాంటమ్ కంప్యూటర్ వితిన్ సెకన్స్ లో చేసి రిజల్ట్ ఇచ్చేస్తుంది. అంటే ఇప్పుడున్న నార్మల్ కంప్యూటర్స్ తో పోలిస్తే క్వాంటమ్ కంప్యూటర్లు సూపర్ పవర్ తో పనిచేస్తాయన్న మాట.
అయితే క్వాంటమ్ బిట్స్ అనుకున్న అవి చాలా సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ అంటే మన కంప్యూటర్లను ఇంటి పెట్టుకుని వాడుకున్నట్లుగా రూమ్ టెంపరేచర్ అంటే గది ఉష్ణోగ్రత దగ్గర వీటిని వాడుకోలేం. ఎలాంటి వైబ్రేషన్స్ కానీ, ఎలాంటి హీట్ కానీ, ఎలాంటి శబ్దాలను తగలకుండా అతి జాగ్రత్తగా క్వాంటమ్ బిట్స్ తో తయారైన క్వాంటమ్ కంప్యూటర్లను భద్ర పరుస్తారు. అందుకోసం పెద్ద పెద్ద ల్యాబ్ లను నిర్మిస్తారు. పెద్ద పెద్ద డైల్యూషన్ రిఫ్రజిరేటర్లు వాడి -273 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర క్వాంటమ్ బిట్స్ ఉండేలా చేస్తారు. అందుకే క్వాంటమ్ ల్యాబ్స్ ను చాలా పెద్దగా ఉంటాయి. చాలా స్పేస్ కావాలి వాటికి.
ఏంటి వీటి వల్ల ఉపయోగం అంటే..చెప్పాగా కొన్ని లక్షల పనులకు రిజల్ట్ ను క్షణకాలంలో ఇచ్చే శక్తి ఈ క్వాంటమ్ కంప్యూటర్లకు ఉంటుంది కాబట్టి..అనేక రంగాల్లో క్వాంటమ్ కంప్యూటర్ల వాడకంతో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి. అంటే కరోనా లాంటి మహమ్మారి వస్తే ఓ మందు మీద ప్రయోగం చేసి ఇప్పుడున్న కంప్యూటర్లతో కుస్తీలు పడి వాటి రిజల్ట్స్ రాబట్టి నెలలకు నెలలు కిందా మీదా పడి వ్యాక్సిన్లు కనిపెట్టే బదులు కొన్ని గంటల్లోనే ఆ పరిశోధనలు పూర్తి చేసి డ్రగ్స్ తయారీకి ఉపయోగపడగల శక్తి ఈ క్వాంటమ్ కంప్యూటర్లకు ఉంటుంది. కేవలం హెల్త్ సెక్టార్ కాదు సెక్యూర్ బ్యాంకింగ్, అడ్వాన్స్ డ్ ఏఐ, ఇంకా వాతావరణం అంచనా కట్టడం, అంతరిక్ష ప్రయోగాలు వాట్ నాట్ క్వాంటమ్ సైన్స్ తో రేపు రాబోయే రోజుల్లో పెను మార్పులే రానున్నాయి. అమెరికా, చైనా, యూరోప్ దేశాలు ఇప్పటికే క్వాంటమ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అనేక ప్రయోగాలు చేస్తున్నాయి. పెద్ద పెద్ద ల్యాబ్ లను క్యాంటమ్ హబ్ లు గా మార్చి అవి ఇస్తున్న రిజల్ట్స్ పై పరిశోధనలు చేస్తున్నాయి.
ఇప్పుడు ఇక భారత్ వంతు వచ్చింది. మనకేం తక్కువ. కావాల్సినంత ప్లేస్ ఉంది. 140 కోట్ల మంది జనాభా ఉన్నాం. ఎంతో మంది యువకులు ఉన్న దేశం మనది. అందుకే భవిష్యత్ అంతా క్వాంటమ్ సైన్స్ చుట్టూ తిరుగుతుందని నారా చంద్రబాబు నాయుడు లాంటి పొలిటిషయన్స్ అంచనా కడుతున్నారు. దానికి తగ్గట్లుగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను రెడీ చేసుకుని...భవిష్యత్ వైపు పరుగులు పెట్టాలని ప్రణాళికలను రచిస్తున్నారు. అందులో భాగంగా అమరావతిలో రాజధాని నిర్మాణాలతో పాటు మరో వైపు క్వాంటమ్ వ్యాలీగా అంటే క్వాంటమ్ కంప్యూటర్లతో పని చేసే కంపెనీలకు ఓ పెద్ద ఆవాసంగా అమరావతిని మార్చాలని ప్లాన్స్ చేస్తున్నారు. అందుకే ఆయన అన్ని సార్లు క్వాంటమ్ వ్యాలీ పేరును తలుచుకుంటున్నది.
మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్ అని ఓ ప్రోగ్రాం పెట్టి దానికి ఆరువేల కోట్ల రూపాయలు పరిశోధనలు కోసం పెట్టుబడులు పెట్టింది. దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలు, ఇస్రో లాంటి సంస్థలు క్వాంటమ్ ల్యాబ్ లను తయారు చేసుకునే పనిలో ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో ఎలా అయితే 90s లో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ విప్లవం వస్తున్నట్లు ఆ సాఫ్ట్ వేర్ బూమ్ ను అంచనా గట్టి హైదరాబాద్ లాంటి నగరాన్ని ఈ రోజు ప్రపంచపటంలో సాఫ్ట్ వేర్ అంటే గుర్తొచ్చేలా హైటెక్ సిటీ, సైబరాబాద్ లాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ చేశారో అలా ఫ్యూచర్ లో క్వాంటమ్ వ్యాలీ అంటే అమరావతి పేరు గుర్తు రావాలన్నది..ఇక్కడే ఆ ఫ్యూచరిస్టిక్ సైన్స్ సరిపడినంత ఇన్ ఫ్రా స్ట్రక్చర్ రెడీ చేయాలన్నది చంద్రబాబు యాంబిషన్.
ఐబీఎం లాంటి కంపెనీలు ఇప్పటికే మేం 156 క్వాంటమ్ బిట్ సిస్టమ్ ను అమరావతిలో ఏర్పాటు చేస్తామని టీసీఎస్, ఎల్ అండ్ టీ లాంటి సంస్థల భాగస్వామ్యాన్ని ఇందుకోసం తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించాయి. 2026 జనవరి నాటికి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ను ప్రారంభించాలని CBN ప్లాన్ చేస్తున్నారు. మొదటగా లక్ష ఉద్యోగాలను క్వాంటమ్ ఫీల్డ్ లో కల్పించాలని అనేది ఆయన టార్గెట్. ఇలాంటి ఎస్టా బ్లిష్మెంట్ ఇప్పటి వరకూ ఇండియాలో లేనే లేదు.
2025-27 మధ్య కాలంలో క్వాంటమ్ వ్యాలీ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ కోసం 2027 నుంచి 2030 మధ్య కాలాన్ని గ్లోబల్ లీడర్ షిప్స్ అండ్ టైఅప్స్ కోసం పెట్టుకుని ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. స్కూల్స్ లో కాలేజీ లెవల్లో విద్యార్థులకు క్వాంటమ్ సైన్స్ ను ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా వాళ్లను ప్రిపేర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వెయ్యి కోట్లు స్టార్టప్ ఫండ్ ప్రభుత్వమే పెట్టుకుని 2030 నాటికి 100 క్వాంటమ్ స్టార్టప్ కంపెనీలు అమరావతిలో మొదలైతే..మరో వైపు పెద్ద పెద్ద కంపెనీలు క్వాంటమ్ ఫీల్డ్ లో తమ పెట్టుబడులను అమరావతిలో పెడితే భవిష్యత్తులో అమెరికా అంటే సిలికాన్ వ్యాలీ గుర్తొచ్చినట్లు అమరావతి అంటే క్వాంటమ్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని వినపడాలని...ఫలితంగా ఇప్పటి వరకూ మరే రాష్ట్రం సాధించని రీతిలో క్వాంటమ్ సైన్స్ ను అందిపుచ్చుకుని ఆంధ్రప్రదేశ్ దశదిశా మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. చూడాలి ఐటీ సెక్టార్ లో తనదైన మార్క్ చూపించినట్లు ఈ క్వాంటమ్ సెక్టార్ లోనూ తన చంద్రబాబు తన విజన్ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటారేమో.





















