America vs India Tariff war | మళ్లీ ఇండియాపై పడి ఏడుస్తున్న అమెరికా | ABP Desam
భారత్‌ని ఎప్పటికప్పుడు తక్కువ అంచనా వేస్తూ.. బొక్కబోర్లా పడటం అమెరికాకి బాగా అలవాటైపోయింది. ముందు 50 శాతం టారిఫ్స్ విధించి భారత్‌ని ఒంచాలనుకున్న ట్రంప్ మావయ్య.. ఆ ప్లాన్ బెడిసి కొట్టి అమెరికన్ మార్కెట్లనే దెబ్బ తీస్తుండటంతో.. ఇప్పుడు టారిఫ్స్ తగ్గించడానికి మేం రెడీగా ఉన్నామంటూనే పనికిమాలిన మెలికలు పెడుతున్నాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ కౌన్సిలర్ పీటర్ నవారో చేసిన కామెంట్సే దీనికి ప్రూఫ్. ‘ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధం ఆ రెండు దేశాల మధ్య యుద్ధం కాదు.. ఇది మోదీ చేస్తున్న యుద్ధం అన్నాడాయన. ఉక్రెయిన్‌పై రష్యా దూకుడుగా దాడులు చేయడానికి కారణం.. వాళ్ల కొట్లాట కాదంట.. రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ భారీగా కొనడమేనంట. అందుకే భారత్‌పై 50 శాతం టారిఫ్స్ వేశాం. ఇప్పటికైనా ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తే.. వెంటనే 25 శాతం టారిఫ్స్ తగ్గిస్తాం’ అని మెహర్బానీ కబుర్లు చెబుతున్నాడు. అంతేకాదు.. అమెరికాకి వస్తువులని ఎగుమతులు చేసి.. అలా వచ్చిన డబ్బుతో రష్యన్ ఆయిల్ కొంటున్న భారత్.. ఆ ఆయిల్‌ని రిఫైన్ చేసి యూరప్ దేశాలకి సేల్ చేస్తూ భారీ లాభాలు జేబులో వేసుకుంటుందట. అది వీళ్ల అసలు ఏడుపు. ఇండియా లాభాలు సంపాదించుకోవడం ఇష్టం లేక వచ్చిన తిప్పలు ఇవన్నీ. ఈ పెద్ద మనిషి చెప్పిన ఇంకో జోక్ ఏంటంటే.. మనం క్రూడ్ ఆయిల్ కోసం రష్యాకి పే చేస్తున్న డబ్బుతోనే పుతిన్ బాబాయ్.. ఉక్రెయిన్‌పై యుద్ధానికి కాలు దువ్వుతున్నాడట. ఇదే కామెడీ అనుకుంటే.. ఇంకా కామెడీ ఏంటో తెలుసా?.. ఇండియా ఇస్తున్న డబ్బుతో రష్యా చేస్తున్న దాడుల నుంచి ఉక్రెయిన్‌ని కాపడటానికి.. పాపం అమెరికా మిలిటరీ హెల్ప్‌తో పాటు.. ఫైనాన్షియల్ ఎయిడ్ చేయాల్సి వస్తోందట. ఇది అమెరికాపై ఫైనాన్షియల్ బర్డెన్ పెంచి.. అమెరికన్ జనాలు ఉద్యోగాలు కోల్పోయేదాక వస్తుందట. అసలు మీడియాముందు కుచ్చేటప్పుడు బుర్ర బీరువాలో పెట్టొస్తారో ఏంటో వీళ్లంతా. అంటే రష్యా ఏదో మొత్తం భారత్ ఇచ్చే డబ్బుతోనే బతుకుతున్నట్లు చెబుతున్నాడీయన. నాకర్థం కాదు.. భారత్ కొంటున్న ఆయిల్‌తో వచ్చిన డబ్బుతో రష్యా యుద్ధం చేస్తుంటే.. మరి చైనా కొంటున్న ఆయిల్‌తో వచ్చిన డబ్బుతో దాన ధర్మాలు చేస్తుందేమో. మరీ ఇంత తింగరోళ్లేంట్రా బాబూ? మీరు ఎంత అరిచి గోల చేసినా.. మా స్టాన్స్ నుంచి వెనక్కి తప్పుకునేది లేదని పీఎం మోదీ పదే పదే చెబుతూనే ఉన్నాడు. అయినా మీరు మారరు. పొద్దున లేచినప్పటి నుంచి ఇండియాపై పడి ఏడుస్తుంటారు. నిజానికి ఉక్రెయిన్‌కి సహాయం చేయడం వల్ల కాదు.. ఇండియన్ గూడ్స్‌పై టారిఫ్స్ వేయడం వల్ల మీ దేశ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అది మానుకోండి. అయినా ఇంత చిన్న లాజిక్ మీకర్థమైతే.. మీరు 32 ట్రిలియన్ డాలర్ల అప్పు ఎందుకు చేస్తారు? ఏంటో మీ బుద్ధి ఎప్పుడు మారుతుందో ఏమో.





















