Will PM Modi Focus on CM Revanth Reddy Government | రేవంత్ రెడ్డి సర్కార్ పై మోదీ కన్ను పడుతుందా.?
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలను మార్చనున్నాయా అంటే అవుననే చెప్పాలి. నిన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ సర్కార్ కూలడం ఖాయమని ,డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని తెలంగాణా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. మరో వైపు ఆరు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని గులాబీ నేతలు చెప్పారు. కాని సార్వత్రిక ఎన్నికల ఫలితాల తీరు చూశాక ఈ రెండు పార్టీల నేతలకు మాటలు పెగడం లేదు. అటు కమలం, ఇటు గులాబీ నేతలు ఇక ముందు ఇలాంటి సవాల్ విసేరే పరిస్థితులు ఉండవని, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించిన మెజార్టీయే ఇందుకు కారణమని మనం అర్థం చేసుకోవచ్చు. గత పదేళ్లలో బీజేపీ చేసిన రాజకీయాలకు ఓటర్ ఓ విధంగా చెక్ పెట్టినట్లే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కూల్చే అధికారం మీకెక్కడిది అని నిలదీసినట్లే.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించిన మెజార్టీయే ఇందుకు కారణమని మనం అర్థం చేసుకోవచ్చు. గత పదేళ్లలో బీజేపీ చేసిన రాజకీయాలకు ఓటర్ ఓ విధంగా చెక్ పెట్టినట్లే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కూల్చే అధికారం మీకెక్కడిది అని నిలదీసినట్లే.