MLA Anam Ramnarayana Reddy Comments : సంచలన వ్యాఖ్యలు చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే
దేశంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గిపోతోందని.. అదే సమయంలో లోకల్ మాఫియా పెచ్చుమీరిపోతోందని అన్నారు మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగిన 9వ బెటాలియన్ పోలీస్ క్రీడోత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా నెల్లూరులో లోకల్ మాఫియా పెచ్చుమీరుతోందని ఆనం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఆయన లోకల్ మాఫియా అంటూ మరోసారి కలకలం రేపారు. ఈ లోకల్ మాఫియాలో పోలీసులు కూడా భాగస్వాములవుతున్నారని, పోలీసులు మాఫియా గ్యాంగుల్లో కలిస్తే ఎలా అని ప్రశ్నించారు. తాను అందర్నీ ఒకే గాటన కట్టడంలేదని, కలుప మొక్కల్ని మాత్రం పీకేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.





















