RCB Victory Parade Stampede | ఆర్సీబీ విక్టరీ పరేడ్ అభిమానుల అత్యుత్సాహం..తొక్కిసలాట | ABP Desam
18ఏళ్ల సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సంబరాలు బెంగుళూరులో శ్రుతిమించాయి. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో దగ్గర తొక్కిసలాట జరిగి పదిమంది ప్రాణాలు కోల్పోయారు. విరాట్ కొహ్లీ సహా తమ ఆరాధ్య ప్లేయర్లను ఒక్కసారి చూడాలని బెంగుళూరులో ఎయిర్ పోర్టు, విధాన సాధ, చిన్నస్వామి స్టేడియాల వద్దకు అభిమానులకు వేల సంఖ్యలో చేరుకున్నారు. ప్రధానంగా కర్ణాటక ప్రభుత్వం అధికారక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన చిన్న స్వామి స్టేడియం వద్ద అభిమానుల తాకిడి మరీ ఎక్కువైంది. ఎర్ర సముద్రాన్ని తలపించేలా వచ్చిన అభిమానులను కంట్రోల్ చేయటం పోలీసుల వల్ల కాలేదు. స్టేడియం గోడలు ఎక్కేస్తూ..ప్రొటెక్షన్ ఫెన్సింగ్ లను విరొగ్గొట్టుకుంటూ అభిమానులు స్టేడియంలోకి ప్రవేశించారు. దీంతో పోలీసులు అభిమానులను కంట్రోల్ చేసేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. ఫలితంగా చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదిమంది అభిమానులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.





















