Election Results 2024 | ఎన్నికలు ముగిశాయి.. మరి రాజకీయ నేతలకు మిగిలింది ఏంటీ.? | ABP Desam
ఎన్నికలంటే లెక్కలు. రాజకీయ సమీకరణాలు..కూడికలు...తీసివేతలు.. కాని చివరకు ఏదో వస్తుందో అదే అన్సర్. చివరకు మిగిలేది అదే.. సార్వత్రిక ఎన్నికలు మగిశాయి.. కొత్త ప్రభుత్వాలు కొలువు తీరుతున్నాయి. ఇక రాజకీయ పార్టీలు, పార్టీ నేతలు తప్పుడు ఎక్కడ జరిగిందని లెక్కలువేసుకుంటున్నాయి. మెజార్టీలు ఎక్కడ తగ్గాయి.. ఎందుకు తగ్గాయి.. ఓటమికి గల కారణాలపై దృష్టి పెట్టాయి. అయితే ఈ తరుణంలో ఈ ఎన్నికల్లో ఎవరికి ఏం మిగిల్చాయి. దేశంలోని కొద్ది మంది ముఖ్యనేతలకు ఈ ఎన్నికల తర్వాత చివరకు మిగిలిందేంటి అన్న విశ్లేషణ ఇప్పుడు చూద్దాం..
ఏ పార్టని అధికారం పీఠం ఎక్కించాలన్నా......వారిని గద్దె దించాలన్నా ఓటర్ మహాశయుడే కీలకం అని మరో సారి సార్వత్రిక ఎన్నికలు తేల్చి చెప్పాయి. ఎన్ని రాజకీయ విన్యాసాలు చేసినా.. ఓటర్ తాను నమ్మి వారికి, నచ్చిన వారికి మాత్రమే ఓటు వేస్తాడని రుజువు చేశాయి ఈ ఎన్నికలు. అయితే ఈ ఎన్నికలను ఓటర్ కోణంలో చూస్తే.. చివరకు మిగిలిందేంటి అన్న ప్రశ్న వేసుకుంటే.... ప్రతీ ఐదేళ్ల తర్వాత ఎంతటి బలమైన పాలకుడినైనా మార్చగలిగే శక్తి నాదే అన్న సంతృప్తి ఓటర్ కు మిగిలింది.