Harrasment Case: అమలాపురంలో లిక్కర్ గోడౌన్ మేనేజర్ పై ఫిర్యాదు
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్ లిక్కర్ గోడౌన్ మేనేజర్ ఆదినారాయణరావుపై... అక్కడే పనిచేసే ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేశారు. నల్లవంతెన దిగువనున్న గోడౌన్ లో పనిచేస్తున్న తనను.... ఆదినారాయణరావు కొన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత యువతి వాపోయారు. రాత్రి వేళల్లో ఫోన్లు చేస్తున్నాడని, గోడౌన్ లో ఎవరూ లేనప్పుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తొలుత కాకినాడ దిశ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా.... అమలాపురం పరిధి కావటంతో టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. సాధారణ కాల్స్ చేస్తే రికార్డ్ చేస్తానేమోనని, వాట్సాప్ కాల్ చేసేవాడని... వేరే ఫోన్ సాయంతో వాటిని రికార్డు చేసేదాన్నని యువతి తెలిపారు. సంభాషణల రికార్డింగులను ఫిర్యాదుకు జత చేశారు.





















