Priyanka Chopra - Globetrotter First Look: మందాకినీగా ప్రియాంక చోప్రా... మహేష్ - రాజమౌళి సినిమాలో ఫస్ట్ లుక్ రిలీజ్!
Priyanka Chopra SSMB29 First Look: సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా 'Globetrotter'లో ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆవిడ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Priyanka Chopra First Look From Mahesh Babu Rajamouli Movie SSMB29 Globetrotter: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) స్టయిలే సపరేట్. ఆయన ఏం చేసినా ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఓ లుక్ లేదా ఒక సాంగ్ లేదా ఒక అప్డేట్... ఏం రిలీజ్ చేసినా తన మార్క్ తప్పకుండా ఉండేలా చూసుకుంటారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ఆయన ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆవిడ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. క్యారెక్టర్ పేరు కూడా చెప్పారు.
మందాకినీగా ప్రియాంక చోప్రా...
రివాల్వర్ రాణీగా లుక్ అదిరిందిగా!
గ్లోబ్ ట్రాటర్... ప్రస్తుతానికి మహేష్ - రాజమౌళి టీమ్ ఆ పదంతో తమ సినిమా గురించి చెబుతోంది. ఇప్పుడు గ్లోబ్ ట్రాటర్ నుంచి మందాకినీగా ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రియాంక చోప్రా చేత రివాల్వర్ పట్టించారు జక్కన్న. ఆయన సోషల్ మీడియాలో ఇచ్చిన క్యాప్షన్ చూస్తే... ఆవిడ పాత్రలో చాలా కోణాలు ఉంటాయని అర్థం అవుతోంది. సినిమాలో హీరోయిన్ లేదా విలన్ - ప్రియాంక రోల్ ఏ విధంగా అయినా మారే అవకాశం ఉందేమో!?
మహేష్ - రాజమౌళి సినిమాకు వారణాసి టైటిల్ పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విడుదల చేసిన ప్రియాంక చోప్రా లుక్ బ్యాగ్రౌండ్ చూస్తే... ఏదో ఒక గుహలో యాక్షన్ సీన్ చేసినట్టు అర్థం అవుతోంది. అందులో దేవతల విగ్రహాలు సైతం ఉన్నాయి. ప్రతి రాయి ఒక కథ చెప్పేట్టు ఉన్నాయి. మరి సినిమా టైటిల్ ఎలా ఉంటుందో? కథ ఎలా ఉంటుందో? అనే క్యూరియాసిటీ క్రియేట్ చేసిందీ పోస్టర్.
Also Read: షూటింగ్‌లో గాయం... ఐదారు నెలలు బెడ్ రెస్ట్... హీరోయిన్ చాందినీ చౌదరి ఇంటర్వ్యూ
The woman who redefined Indian Cinema on the global stage. Welcome back, Desi Girl! @priyankachopra
— rajamouli ss (@ssrajamouli) November 12, 2025
Can’t wait for the world to witness your myriad shades of MANDAKINI.#GlobeTrotter pic.twitter.com/br4APC6Tb1
నవంబర్ 15 కోసం ఫ్యాన్స్ వెయిటింగ్...
మొదటి పాట 'సంచారి'కి సూపర్బ్ రెస్పాన్స్!
మహేష్ - రాజమౌళి సినిమా SSMB29 నుంచి మొదట విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆయన కుంభ పాత్ర చేస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతంలో శృతి హాసన్, కాలభైరవ పాడిన 'సంచారి' పాట విడుదల చేశారు. దానికి చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు. ఆ రెండిటికీ రెస్పాన్స్ సూపర్బ్ అని చెప్పాలి. ఇప్పుడు ఆడియన్స్ అందరూ నవంబర్ 15 కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ రోజు టైటిల్, అలాగే మహేష్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
She’s more than what meets the eye… say hello to Mandakini. #GlobeTrotter@ssrajamouli @urstrulyMahesh @mmkeeravaani @SriDurgaArts @SBbySSK @PrithviOfficial pic.twitter.com/3KqKnb2D5h
— PRIYANKA (@priyankachopra) November 12, 2025
దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను వరల్డ్ వైడ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టుగా సినిమా రెడీ చేస్తున్నారు రాజమౌళి.





















