అన్వేషించండి

Chandini Chowdary Interview: షూటింగ్‌లో గాయం... ఐదారు నెలలు బెడ్ రెస్ట్... హీరోయిన్ చాందినీ చౌదరి ఇంటర్వ్యూ

Santhana Prapthirasthu Release Date: చాందిని చౌదరి డెడికేషన్ గురించి 'సంతాన ప్రాప్తిరస్తు' టీం గొప్పగా చెబుతోంది. తనకు ఎదురైన ఇంజ్యూరీ గురించి ఏబీపీ దేశంతో ఇంటర్వ్యూలో చాందిని చౌదరి చెప్పారు.

''నాకు ఈ మూవీ షూటింగ్‌లో మోకాలికి గాయమైంది. కానీ షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో పాటు మరో ప్రాజెక్ట్ కూడా చేస్తున్నా. నా ఒక్క దాని వల్ల షూటింగ్‌కు బ్రేక్ తీసుకుంటే... ఎంతో మంది డేట్స్ మిస్ అవుతాయి. ఎన్నో కోట్ల నష్టం వస్తుంది. అందుకని అలా షూట్‌ కంటిన్యూ చేశా. కానీ దాని వల్ల నాకు మరిన్ని సమస్యలు వచ్చాయి. ఐదారు నెలలు బెడ్ రెస్ట్ తీసుకునే వరకు వెళ్లింది. కానీ ఆ సినిమా షూటింగులు ఆపలేదు. ఫినిష్ చేసేశా'' అని చాందిని చౌదరి చెప్పారు. 

చాందిని చౌదరి (Chandini Chowdary) కథానాయికగా నటించిన తాజా సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు' (Santhana Prapthirasthu Movie). 'మధుర' శ్రీధర్ రెడ్డి, నిర్వి హరి ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. విక్రాంత్ హీరో. నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏబీపీ దేశంతో హీరోయిన్ చాందినీ చౌదరి ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే..

  • నేను మామూలుగానే పూర్తి కథ, స్క్రిప్ట్ విన్న తరువాతే ఓకే చెబుతాను. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ తీసుకుని, డైలాగ్ టు డైలాగ్ చదివాను. ఎంతో వినోదాత్మకంగా చెబుతూ.. సమస్యను అందరికీ వివరించేలా కథను రాసుకున్నారు. ఎంతో విలువైన విషయాల్ని ఎంతో గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. పాయింట్, ట్రీట్మెంట్ ఇలా అన్నీ నాకు చాలా నచ్చాయి.
  • నా వద్దకు వచ్చిన ప్రతీ కథను నేను ఒప్పుకోను. చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్ అంతా చదివి ఆచితూచి కథల్ని ఎంచుకుంటున్నాను. దీనికి ముందు చేసిన కథ ఏంటి? ఇప్పుడు చేస్తున్నది ఏంటి? తేడా ఉందా? లేదా? అన్నది చూసుకుంటాను. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఇందులో ఎన్ని ప్రయోగాలుంటే అన్నీ చేయాలని చూస్తుంటాను. నన్ను నేను ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే రకరకాల పాత్రల్ని చేస్తున్నాను.

Also Read: 'సంతాన ప్రాప్తిరస్తు'తో కొత్త అవతారంలో విక్రాంత్... 'స్పార్క్' ఫెయిల్యూర్ తర్వాత ఏం నేర్చుకున్నారంటే?

  • 'కలర్ ఫోటో'లోని ఎమోషనల్ సీన్‌తో పాటుగా 'సమ్మతమే'లో నా ఎమోషనల్ సీన్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఆ రెండు ఎమోషనల్ సీన్స్ అంటే నాకు చాలా ఇష్టం. 'అన్‌ హర్డ్' సిరీస్‌లో 34 పేజీల డైలాగ్‌ని చెప్పడం ఓ ఛాలెంజింగ్. ఎక్కువ టైం లేకపోవడంతో మొత్తం ప్రిపేర్ అయి సెట్‌కి వెళ్లి ఒకే రోజులు ఆ సీన్లన్నీ పూర్తి చేశాం. నటిగా నన్ను నేను ఛాలెంజ్ చేసుకున్న సందర్భమంటే అదే. బాలాదిత్య, ప్రియదర్శి వంటి వారితో అన్ని పేజీల డైలాగ్స్ చెప్పడం మెమరబుల్‌గా అనిపిస్తుంది.
  • విక్రాంత్‌ (Hero Vikranth)ని నేను సరదాగా షూటింగ్ సెట్‌లో ఏడ్పించేదాన్ని. నాకు విక్రాంత్ దర్శకుడు అని ఈ మధ్యే తెలిసింది. మా మూవీ షూటింగ్‌లో ఎక్కడా కూడా దర్శకుడు అని చెప్పలేదు. నాకు తెలీదు. మా సెట్‌లో దర్శకుడిగా కాకుండా యాక్టర్‌గానే ఫోకస్ పెట్టి చేశారు.

Also Read: 'శివ'లో చైల్డ్ ఆర్టిస్ట్... సైకిల్ టు అమెరికా... ఇప్పుడెలా ఉందో చూశారా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Advertisement

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget