Shiva Re Release: 'శివ'లో చైల్డ్ ఆర్టిస్ట్... సైకిల్ టు అమెరికా... ఇప్పుడెలా ఉందో చూశారా?
RGV On Shiva Child Artist: 'శివ' మూవీ హైలైట్స్‌లో ఛేజింగ్ సీక్వెన్స్ తప్పకుండా ఉంటుంది. అందులో నాగార్జునతో పాటు సైకిల్ మీద ఉన్న చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో? ఏం చేస్తుందో తెలుసా?

ఇండియన్ సినిమా హిస్టరీలో 'శివ' (Shiva Movie) సినిమాకు ఉండే స్థానమే వేరు. తెలుగు సినిమా గతిని మార్చేసిన 'శివ' ఇప్పుడు మరోసారి ప్రేక్షకులు అందరినీ అలరించడానికి వస్తోంది. 'శివ' రీ రిలీజ్ (Shiva Re Release)ను రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma), నాగార్జున (Nagarjuna Akkineni) ఎంత గ్రాండ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. సినిమా విడుదలై 35 ఏళ్ళు. అప్పటికీ, ఇప్పటికీ కింగ్ నాగార్జున ఒకేలా ఉన్నారు. అయితే... ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్, హీరో అన్నయ్య కుమార్తెగా నటించిన అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఎలా ఉందో తెలుసా?
సైకిల్ టు అమెరికా... ఇప్పుడు ఏఐ!
'శివ' మూవీ హైలైట్స్‌లో ఛేజింగ్ సీక్వెన్స్ తప్పకుండా ఉంటుంది. అందులో నాగార్జునతో పాటు సైకిల్ మీద ఉన్న చిన్నారి ఉంటుంది కదా! హీరో అన్నయ్య కుమార్తె. ఆ చైల్డ్ ఆర్టిస్ట్‌ను వర్మ ఇప్పుడు మళ్లీ వెలుగులోకి తీసుకు వచ్చారు. శివ సినిమాలో అన్న కూతురుతో ఎమోషనల్ ట్రాక్ ఉంటుంది.. ఓ ఛేజింగ్ సీన్, ఫైటింగ్ సీన్‌ను కూడా వర్మ పెట్టాడు. ఇక ఆ ఛేజింగ్ సీన్ గురించి మాట్లాడుతూ.. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏం చేస్తోంది? అనే విషయాల్ని వర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
'శివ'లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఈవిడే... పేరు సుష్మ. ఐకానిక్ ఫైట్ సీక్వెన్స్‌లో ఎంతో భయభయంగా సైకిల్ బార్ మీద నాగార్జునతో కలిసి కూర్చుంది. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఏఐ అండ్ కాగ్నిటివ్ సైన్స్‌లో పని చేస్తోంది అంటూ ట్వీట్ చేశారు వర్మ.
Also Read: మాస్ జాతర బాకీ తీర్చేయాలి... సంక్రాంతి సినిమాలకు భరోసా ఇవ్వాలి
Thank you, sir! Honored to be remembered as part of Shiva's legacy. That experience as a child was unforgettable, and I'm grateful to have contributed to such an iconic film. Wishing you @RGVzoomin and @iamnagarjuna continued success with the Shiva 4K release! 🙏
— Sushma Anand Akoju. She/Her (@symbolicsushi) November 12, 2025
వర్మ ట్వీట్‌కు సుష్మ వెంటనే రియాక్ట్ అయింది. ''మీరు నన్ను గుర్తు పెట్టుకున్నందుకు, ఇలా గుర్తించినందుకు థాంక్యూ సర్.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నాటి రోజుల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను సర్.. ఇలాంటి ఓ ఐకానిక్ చిత్రంలో నేను కూడా పార్ట్ అయినందుకు సంతోషంగా, గర్వంగా ఉంది సర్.. మళ్లీ ఈ శివ 4కే రిలీజ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని ట్వీట్ వేసింది. నవంబర్ 14న రానున్న ఈ శివ రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: ధర్మేంద్రను అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్లిన ఫ్యామిలీ... లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏమిటంటే?
Being part of Shiva is a cherished memory. That cycle chase adventure influenced me and prepared me for later intellectual endeavors and adventures. I felt safe and excited to be part of something magical. Shiva remains a souvenir. 🙏https://t.co/bzdtBwMCVP
— Sushma Anand Akoju. She/Her (@symbolicsushi) November 12, 2025
'శివ' సినిమాకు మూలం ఎక్కడ పుట్టిందో ఇది వరకే చాలా సార్లు వర్మ చెప్పిన సంగతి తెలిసిందే. బ్రూస్ లీ నటించిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' చూసి, ఆ కథను మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశానని, అలా శివ కథ పుట్టిందని రామ్ గోపాల్ వర్మ చెప్పిన సంగతి తెలిసిందే. తనని తాను నిరూపించుకుని మళ్లీ నాగార్జున వద్దకు వెళ్లి కథను చెబుతాను అని వర్మ రీసెంట్‌గా జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. దాదాపు 8 నెలలు కష్టపడి, ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని 'శివ'ని 4కే, డాల్బీ అట్మాస్‌లోకి మార్చిన సంగతి తెలిసిందే. అప్పుడు చూసిన దాని కంటే ఇప్పుడు సినిమా చూస్తే మరింత అద్బుతంగా ఉంటుందని వర్మ చెప్పుకొస్తున్నారు.





















