Puneeth Rajkumar Final Rites: రియల్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు కన్నీటి వీడ్కోలు
కథానాయకుడిగా పునీత్ రాజ్‌కుమార్‌కు ఎంత పేరుందో... మానవతావాదిగా అంతకంటే ఎక్కువ పేరుంది. వెండితెరపై తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఆయన... నిజ జీవితంలో సేవా కార్యక్రమాలతో అంత కంటే ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్నారు. నిజ జీవితంలో తన ప్రవర్తనతో ఎంతోమంది గుండెల్లో గూడు కట్టుకున్నారు. సామాన్య ప్రజల్లో మాత్రమే కాదు... రాజకీయ, సినీ, సామాజిక ప్రముఖుల్లోనూ పునీత్ రాజ్‌కుమార్‌కు అభిమానులు ఉన్నారు. పునీత్ అకాల మరణంతో వారంతా శోకసంద్రంలో మునిగారు. ముఖ్యంగా... పునీత్ సోదరుడు, కథానాయకుడు శివ రాజ్‌కుమార్! కన్నీటితో కడసారి వీడ్కోలు పలికారు. పునీత్ అంతిమయాత్ర జరిగిన బెంగళూరు రోడ్లు, కన్నడ కంఠీరవ స్టేడియం ప్రాంతాలు కన్నీటి సంద్రమయ్యాయి.




















