Vishwak Sen Party Nandamuri Balakrishna | లైలా, టిల్లూతో డాకూ పార్టీ | ABP Desam
నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం డాకూ మహారాజ్ విజయం సాధించిన సందర్భంగా ఫ్రెండ్స్ తో కలిసి గ్రాండ్‌గా సక్సెస్ పార్టీ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్‌లో హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ పాల్గొన్నారు. వీరి మధ్య ఉన్న స్నేహాన్ని చూస్తే అభిమానులు ఫిదా అయ్యారు.పార్టీలో ఫుల్ జోష్ తో ఎంజాయ్ చేస్తున్నప్పుడు విశ్వక్ సేన్ ఒక వీడియో తీశాడు. ఆ వీడియోలో బాలయ్య థాంక్యూ మై డియర్ బ్రోస్ అని చెబుతూ విశ్వక్, సిద్ధులకి పప్పీస్ ఇచ్చారు. ఈ మోమెంట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ ముగ్గురు కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్రెండ్ షిప్ కి ఏజ్ తో సంబంధం లేదని ఈ ముగ్గురు చూపించారు. బాలకృష్ణ లాంటి సీనియర్ హీరో కొత్త తరం హీరోలతో ఇంత క్లోజ్ గా ఉండటం ప్రత్యేకం. విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ కూడా బాలయ్యతో కలసి ఆ మోమెంట్ ని ఎంజాయ్ చేస్తూ తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ పార్టీ ద్వారా సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా ఇండస్ట్రీలో స్నేహం ఎలా ఉండాలో చూపించారు. డాకూ మహారాజ్ సినిమా విజయం అందరికీ సంతోషం తెచ్చి, బాలయ్య అభిమానులకు సెలబ్రేషన్ స్టార్టింగ్ గా మారింది.





















