Temba Bavuma 66 vs AUS WTC Final 2025 | హేళన చేసిన నోళ్లను మూయించి..సౌతాఫ్రికా కలను తీర్చి | ABP Desam
టీమ్ ఇండియా టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ గెలిచిన తర్వాతే మాట్లాడాడు కింగ్ విరాట్ కొహ్లీ. ఆయన ఓ మాట అన్నాడు. ఈ ఐపీఎల్ ట్రోఫీలు గెలవటం ఓకే కానీ టెస్ట్ క్రికెట్ తో పోలిస్తే నా చేతిలో 18ఏళ్ల తర్వాత గెలిచిన ఐపీఎల్ ట్రోపీ ఐదు లెవల్స్ కింద ఉంటుంది అన్నాడు. అంత గొప్పది టెస్ట్ క్రికెట్. విపరీతమైన ఓపిక, సహనం, క్రికెట్ లో నీకంటూ బలమైన టెక్నిక్ ఉంటే తప్ప టెస్ట్ బ్యాటర్ గానో బౌలర్ గానో అస్సలు రాణించలేం. అలాంటిది 27ఏళ్లుగా ఓ ఐసీసీ టోర్నీ గెలుపు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సౌతాఫ్రికాను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిపాడు 35ఏళ్ల కెప్టెన్ తెంబా బవుమా. ఇప్పటి వరకూ టెస్టుల్లో కెప్టెన్ గా ఓటమి అంటే ఏంటో తెలియని బవుమా 2021లో టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు అందుకునేంత వరకూ జీవితంలో చాలా ఎత్తు పల్లాలు చూశాడు. కేవలం 5 అడుగుల 4 అంగుళాలు మాత్రమే హైట్ ఉండే బవుమాను నీకు క్రికెట్ అవసరమా పొట్టోడా అంటూ అవమానించిన నోళ్ల మధ్య..నల్లజాతీయుడివి నీకెందుకురా ఆటలు అంటూ జాత్యాంహకారం చూపించిన మనుషుల మధ్య క్రికెట్ నేర్చుకున్నాడు. ఆటగాడిగా తనను తను ప్రూవ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే నాయకుడిగా సౌతాఫ్రికన్ క్రికెట్ తనకు బాధ్యతలు అప్పగించిందో..సఫారీలు అంటే స్ట్రాంగ్ క్రికెట్ టీమ్ అనే బ్రాండ్ ను మరింత ముందుకు తీసుకువెళ్లేలా విజయాలు అందించాడు. 9 టెస్టులకు కెప్టెన్సీ చేసిన బవుమా ఒక్కటి కూడా ఓడిపోలేదంటే అర్థం చేసుకోవచ్చు. కెప్టెన గా తన స్ట్రాటజీలు ఎలా ఉంటాయో. ఇక బ్యాటర్ గానూ అద్భుతాలు చేసే బవుమా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ పైనల్ లో హార్మ్ స్ట్రాంగ్ ఇంజ్యూరికి గురైనా ఎక్కడా తగ్గకుండా 134 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతో 66పరుగులు చేసి ఏడెన్ మార్ క్రమ్ కు అద్భుతమైన సహకారం అందించాడు. ఫలితమే 27ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ట్రోఫీని సౌతాఫ్రికా ముద్దాడింది. పొట్టోడు అన్న నోళ్లతోనే తన హైట్ ఉండే గదను పట్టుకుని మేటర్ ఉండాల్సింది హైట్ లో కాదు మైండ్ లో..గుండెల్లో దమ్ము రూపంలో అని నిరూపించిన తెంబా బవుమా సౌతాఫ్రికాను టెస్టుల్లో విశ్వవిజేతగా నిలిపాడు. ఇంతకీ తెంబా అనేది వాళ్ల నాన్నమ్మ పేరు. తెంబా అంటే అర్థం హోప్ నమ్మకం.





















