దీపికా పిల్లిని అదృష్టం వరించిందంటున్న టీవీ ఇండస్ట్రీ
దీపికా పిల్లి... 'ఢీ 13' సీజన్ ముందు వరకూ టీవీ ఆడియన్స్‌లో ఆమె గురించి తెలిసిన ప్రేక్షకులు తక్కువ. అప్పటికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పాపులర్ ఫేస్. ఇన్‌స్టాలో ఆమె ఫాలోయింగ్, హుషారు చూసి 'ఢీ 13: కింగ్స్ వర్సెస్ క్వీన్స్'కు రష్మీ గౌతమ్‌తో పాటు మరో ఫీమేల్ టీమ్ లీడర్‌గా సెలెక్ట్ చేశారు. మధ్య 'జబర్దస్త్'లో ఒక స్కిట్ చేశారు. తన అందంతో, అభినయంతో, చలాకీతనంతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దగ్గరకు వెళ్లారు. ఆయనతో సినిమా చేసే అవకాశం అందుకున్నారు."ఇప్పుడే ఓ అద్భుతమైన స్క్రిప్ట్ విన్నాను... అదీ లెజెండ్ రాఘవేంద్ర రావు గారి నుంచి! నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. త్వరలో మేజర్ అప్‌డేట్ ఇస్తా" అని రాఘవేంద్రరావుతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు దీపికా పిల్లి.





















