TTD Special Focus on Tirumala Laddu | తిరుమల లడ్డూపై టీటీడీ ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది..?
కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు లక్షలాది తరలివస్తున్నారు. స్వామిని అరక్షణం పాటు చూసి ఆ దర్శనం కోసం పడిన కష్టాన్ని మర్చిపోతారు. తిరుమల దర్శనం తర్వాత భక్తుల దృష్టి స్వామి అద్భుతమైన ప్రసాదం వైపు మళ్లుతుంది. అదే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం.స్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూను పొందాలని..దాని రుచిని ఆస్వాదించాలని కోరుకోని భక్తుడు ఉండడు..కానీ ఇటీవల కాలంలో రాను రాను తిరుమల లడ్డూ సైజు మారింది. ఇది వరకూ అరచేతిలో సరిపోనంత లడ్డూలు విక్రయించే దగ్గర్నుంచి ఇప్పుడు లడ్డూల పరిణామం తగ్గిందని చూస్తేనే అర్థమవుతోంది. ప్రధానంగా గడచిన ఐదేళ్లలో తిరుమల లడ్డూ విక్రయాల్లో అనేక మార్పులు చేర్పులు వచ్చాయి. సరిగ్గా ఇదే భక్తుల ఫిర్యాదులకు కారణం అవుతుంటే...ఇప్పుడు టీటీడీ ఉన్నతాధికారులు లడ్డూ నాణ్యతపైనే దృష్టి సారించారు..తిరుమల లడ్డూ కు 84 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1803 లో తిరుమలలో ప్రసాదాలు పంపిణీ ప్రారంభమైంది. 1804 లో అప్పటి తిరుమల పాలకులు భక్తులకు తీపి ప్రసాదం గా బుందీ పంపిణీ చేసేవారు. 1940లో లడ్డూగా భక్తులకు అందించడం ప్రారంభమైంది. 1950 లో దిట్టం అనే పేరుతో వంటశాల ఆలయంలోనే ప్రారంభించారు. పెరుగుతున్న భక్తుల దృష్టి వంటశాల తో పాటు ప్రస్తుతం 3,30,000 నుంచి 3,50,000 వరకు ప్రతి రోజు లడ్డూలను తయారు చేస్తున్నారు. లడ్డూ తయారీ అనేది చాలా ప్రత్యేకమైన విధానం లో తయారు చేస్తారు. ఇందుకోసం దిట్టం అని ఉంటుంది. అంటే ఎన్ని లడ్డూల తయారీకి ఎంత ముడిసరుకు తీసుకోవాలనే లిస్టు ఉంటుంది. దాన్ని అచ్చం అలాగే ఫాలో అవ్వాలి. 5001 లడ్డూలకు గాను 165 కిలోల ఆవు నెయ్యి, 180 కిలోల శెనగపిండి, 400 కిలోల చెక్కెర, 30 కిలోల జీడిపప్పు, 16 కిలోల ఎండు ద్రాక్ష, 8 కిలోల కలకండ, 4 కిలోల యాలకులు వేసి తయారు చేస్తారు. ఇక్కడ లడ్డూకు ఉండే రుచి కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి పేటెంట్ రైట్స్ కూడా ఉన్నాయి. ఏటా 200నుంచి 250కోట్ల లడ్డూలను తయారు చేసి విక్రయిస్తుంది టీటీడీ..