Tollywood For AP: ఆంధ్రప్రదేశ్ లో వరదబాధితులను ఆదుకునేందుకు కదిలివచ్చిన టాలీవుడ్ స్టార్స్| ABP Desam
ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులకు సాయం చేయడానికి టాలీవుడ్ స్టార్స్ ముందుకు వచ్చారు. ఒక్కొక్కరూ స్పందిస్తున్నారు. వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ చిరంజీవి పాతిక లక్షల రూపాయలు సాయం చేశారు. ఆ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు అందిస్తున్నట్టు ఆయన తెలిపారు.ఎన్టీఆర్ కూడా ఇప్పటికే 25 లక్షలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నవంబర్ 24న తిరుపతి వర్షాల కారణంగా ఇబ్బంది పడిన ప్రజల సహాయార్థం రూ. 10 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్నట్టు తెలిపింది.





















