అన్వేషించండి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అఖండ టీమ్
తిరుమల శ్రీవారిని అఖండ చిత్ర యూనిట్ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ కథానాయకుడు బాలకృష్ణ, చిత్ర దర్శకుడు బోయపాటి శీను, చిత్ర నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డిలు, స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా,ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. అఖండ సినిమాకు ప్రజలు బ్రహ్మరథం పట్టి అఖండ విజయాన్ని అందించారన్నారు.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ధైర్య సాహసం చేసి విడుదల చేసామని తెలిపారు.
వ్యూ మోర్





















