Sketch on MLA Kotam Reddy Sridhar reddy | కోటంరెడ్డిని లేపేస్తే ఎమ్మెల్యే పదవి ఇస్తాం | ABP Desam
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర జరిగినట్లు సంచలన వీడియో ఒకటి బయటకు వచ్చింది. గత ఎన్నికల ముందు వరకూ వైసీపీలో ఉన్న కోటం రెడ్డి ఆ తర్వాత పరిణామాలకు వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీ లో చేరి మళ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే కోటం రెడ్డిని చంపేస్తే..ఎమ్మెల్యే పదవి, కావాల్సినంత డబ్బు ఇస్తామంటూ ఇటీవల అరెస్టైన లేడీ డాన్ అరుణకు, ఆమె ప్రియుడు శ్రీకాంత్ కు సుపారీ అందినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ అనుచరుడైన జగదీశ్, మహేశ్, వినీత్ లు మద్యం సేవించి కోటం రెడ్డి హత్యకు సంబంధించి మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకు లీక్ అయ్యింది. ఈ సమాచారం పోలీసులకు అందటంతో నిడి గుంట అరుణను అరెస్ట్ చేయటంతో పాటు శ్రీకాంత్ పెరోల్ ను రద్దు చేశారు. పైగా కోటంరెడ్డి మర్డర్ కోసం వేసిన స్కెచ్ ను పోలీసులు భగ్నం చేసినట్లు సమాచారం అందుతోంది.





















