మైనర్ బాలిక ఆత్మహత్య ఘటనపై రోజా ఫైర్
టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులు తట్టుకోలేక విజయవాడలో ఆత్మహత్య చేసుకుంది తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక. ఈ ఘటనపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. తండ్రిలా చూసుకోవాల్సిన వ్యక్తి ఎంతలా వేధించాడో ఆమె పుస్తకంలో రాసుకున్న విషయాలు చూస్తే తెలుస్తుందని అన్నారు. వినోద్ జైన్ కు కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. నారీ శక్తి పేరుతో ధర్నాలు చేసేముందు.. తమ పార్టీ వాళ్లు ఏం చేశారో ఆలోచించాలంటూ రోజా ఫైర్ అయ్యారు. మహిళలెవ్వరూ.. ఇలాంటి వేధింపుల బారిన పడి ఆత్మహత్య చేసుకోవద్దని... దిశ యాప్ కు సమాచారమిస్తే.. పోలీసులే మొత్తం చూసుకుంటారని తెలిపారు. బాలిక గనుక దిశ యాప్ ను సంప్రదించి ఉంటే... ఇలా ప్రాణాలు కోల్పోయి ఉండేది కాదని రోజా బాధపడ్డారు.






















