Chiranjeevi Counter to Balakrishna | అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి కౌంటర్ | ABP Desam
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. చిరంజీవి గట్టిగా నిలదీస్తేనే జగన్ కలిశారన్న కామినేని వ్యాఖ్యలను బాలకృష్ణ కొట్టిపారేయగా...నాటి ఘటనను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. టికెట్లు రేట్లను తగ్గించేయటంతో ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉందని తనను స్టార్ హీరోలు, డైరక్టర్లు, ప్రొడ్యూసర్లు కలిసి అడిగితేనే అప్పటి ఏపీ సీఎం జగన్ ను కలిశానన్న చిరంజీవి..జగన్ అపాయిట్మెంట్ తీసుకుని ఇండస్ట్రీ ప్రముఖులను తీసుకుని వెళ్లి రెండోసారి కలిసిట్లు తెలిపారు. అప్పుడు బాలకృష్ణ కూడా రావాలని ఫోన్ చేసినా, జెమినీ కిరణ్ ను మూడుసార్లు పంపి బాలయ్యను ఆహ్వానించాలన కోరినా బాలకృష్ణ అందుబాటులోకి రాలేదని క్లారిటీ ఇచ్చారు. అయినా ఇండస్ట్రీ మేలు కోసం జగన్ ను కలిసి రిక్వెస్ట్ చేశాను కాబట్టే అప్పట్లో బాలకృష్ణ వీరసింహారెడ్డికి, తన వాల్తేరు వీరయ్య సినిమా కు టిక్కెట్ల రేట్లను ఏపీ ప్రభుత్వం పెంచిందని దీంతో ఇద్దరి సినిమాల ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు లాభపడ్డారని అది ఇండస్ట్రీకి మేలు చేసిందని..బాలయ్య అసెంబ్లీలో వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు సరికాదని..విదేశాల్లో ఉన్న కారణంగా పత్రికా ప్రకటన ఇస్తున్నట్లు చిరంజీవి బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.





















