అన్వేషించండి
కర్నూలు జిల్లా చాగలమర్రి వద్ద తెలుగు గంగ కాలువ నుంచి నీరు లీకేజీ
కర్నూలు జిల్లా చాగలమర్రి సమీపంలో తెలుగు గంగ ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి నీరు లీకేజీ అవుతోంది. దీంతో మండలంలోని పెద్ద వంగలి, చిన్న వంగలి, చింతల చెరువు, కొలుములపేట గ్రామాల్లోని దాదాపు 200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.అధికారుల నిర్లక్ష్యం వల్ల చేతికొచ్చిన పంటలు నీటి పాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీజీపీ కాలువ నీటి ప్రవాహాన్ని తగ్గించి లీకేజీలు లేకుండా చూస్తామని ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఓటీటీ-వెబ్‌సిరీస్





















