Kannappa Temple ABP Desam Exclusive | భక్త కన్నప్ప పుట్టింది ఈ ఊరిలోనే | ABP Desam
భక్త కన్నప్ప గా ప్రసిద్ధి పొందిన తిన్నడు జన్మస్థలం ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని ఊటుకూరు అనే గ్రామం గా పేర్కొంటూ శాసనాలు లభ్యమయ్యాయి. కడప -తిరుపతి రోడ్డు లో రాజంపేట శివార్ల లో ఉండే ఊటుకూరు ను తిన్నడు జన్మస్థలం అనీ శివభక్తుడు గా మారాక ఆయనే ఇక్కడ ఒక శివలింగాన్ని స్థాపించి పూజలు జరిపాడని స్థానిక కథనం. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం గురించి ఇక్కడి శాసనాలు.. కైఫీయత్ లలో నమోదై ఉన్నట్టు తెలియడం తో ఇటీవల ఈ ఆలయం పాపులర్ అవుతోంది. తన క్రొత్త సినిమా "కన్నప్ప " రిలీజ్ సందర్బంగా హీరో మంచు విష్ణు కూడా ఊటుకూరు శివాలయం ను దర్శించి పూజలు జరిపారు. 'కన్నప్ప' జూన్ 27న విడుదల కానున్న నేపథ్యంలో ఏపీలోని ఊటుకూరు గ్రామానికి వెళ్లిన విష్ణు మంచు, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ఊరు భక్త కన్నప్ప జన్మస్థలం అని సమాచారం. మరి, శాసనాలు ఏం చెబుతున్నాయి?






















