Viral Video: వాషింగ్ మిషన్ లో వింత శబ్దాలు... తెరిచి చూస్తే గుండె హడల్
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాల్ చెరువు గ్రామంలో ఒక ఇంట్లో వాషింగ్ మిషన్ లో నాగుపాము హల్ చల్ చేసింది. కుంచే శ్రీనివాస్ ఇంటిలో ఉన్న వాషింగ్ మిషన్ లో మంగళవారం ఉదయం నాగుపాము కనబడటం తో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించడంతో ఆయన పామును చాకచక్యంగా పట్టుకోవడంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
తిరుమల నుంచి పాపవినాశనానికి వెళ్లే దారిలో ఉన్న వేణుగోపాల స్వామి గుడి వద్ద ఓ దుకాణంలో జెర్రిపోతు ప్రత్యక్షంమైంది. దాదాపు పది అడుగుల పొడువు ఉన్న జెర్రిపోతు అక్కడే ఉన్న దుకాణంలోని ఓ బీరువాలోకి చోరబడింది. బీరువాను తెరిచిన చూస్తే జెర్రిపోతు కనిపించింది. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు అందుబాటులో లేకపోవడంతో రెండు రోజుల పాటు జెర్రిపోతు పామును ఆ బీరువాలోనే ఉంచారు. అయితే ఇవాళ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు చాకచక్యంగా బీరువాను తెరిచి పామును పట్టుకున్నారు. పామును సమీపంలోని అటవీ ప్రాంతంలో వదలి పెట్టారు.