Viral Video: విమానంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ - చొక్కాలు తీసి మరీ కొట్టుకున్నారు!
Viral Video: ఈ మధ్య విమానాల్లో కూడా బస్సుల్లో సీట్ల కోసం కొట్టుకుంటున్నట్లుగా కొట్టుకున్నారు. కారణాలు ఏవైనా సరే తాజాగా ఇద్దరు గాల్లో విహరిస్తూనే ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు.
Viral Video: గతంలో పల్లె వెలుగు బస్సుల్లో సీట్ల కోసం కొట్టుకున్నట్లుగానే విమానాల్లో కూడా కొట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు మనం తరచుగా చూస్తున్నాం. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఎయిర్ ఇండియా న్యూయార్క్- ఢిల్లీ విమానంలో వృద్ధ మహిళా ప్రయాణీకురాలి సీటుపై మూత్రం పోశాడో వ్యక్తి. దీనిపై కేసు నమోదైంది. ఆ మూత్రం పోసిన వ్యక్తి అరెస్టు కూడా అయ్యాడు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు గొడవ పడిన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ముందుగా గొడవ పడ్డ యువకుడు ఆ తర్వాత తన ఒంటిపైనున్న చొక్కాను విప్పి మరీ తోటి ప్రయాణికుడిపై గుద్దుల వర్షం కురిపించాడు. అయితే విమానంలో జరిగిన వాగ్వాదాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Another "Unruly Passenger" 👊
— BiTANKO BiSWAS (@Bitanko_Biswas) January 7, 2023
This time on a Biman Bangladesh Boeing 777 flight!🤦♂️ pic.twitter.com/vnpfe0t2pz
చొక్కా విప్పి మరీ గుద్దులు - ఆపిన ప్రయాణికులు
బంగ్లాదేశ్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ గొడవ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఇద్దరూ గొడవ పడుతుండటం మనం చూడవచ్చు. ట్విట్టర్ యూజర్ బిటాంకో బిస్వాస్ షేర్ చేసిన వీడియో ప్రకారం, బంగ్లాదేశ్ జాతీయ క్యారియర్ అయిన బిమాన్ బంగ్లాదేశ్ విమానంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చొక్కా విప్పేసిన ఓ ప్రయాణీకుడు విమానం ముందు వరుసలో కూర్చున్న మరో ప్రయాణికుడితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఏడుస్తూనే అతడిపై దాడి చేశాడు. వాదన సమయంలో.. ఆ వ్యక్తి తన సహ-ప్రయాణికుడి కాలర్‌ను పట్టుకుని కనిపించాడు. అతని ముఖం వీడియోలో స్పష్టంగా కనిపించడం లేదు. కానీ చొక్కాలేని వ్యక్తి అతడి చెంపపై కొట్టాడు. దీంతో గొడవ మరింత పెరిగింది. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారు. అక్కడే ఉన్న మరికొందరు ప్రయాణికులు వారిద్దరినీ ఆపే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి తేదీ, విమాన మార్గం గురించి తెలియాల్సి ఉంది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.
ఇటీవలే ప్రయాణికురాలిపై యూరినేట్
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో మహిళపై యూరినేట్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి ఢిల్లీ పోలీసులు బెంగళూరులో శంకర్ శేఖర్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. గతేడాది నవంబర్ 26న ఈ ఘటన జరగ్గా...అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు...ఎట్టకేలకు బెంగళూరులో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఉన్నాడన్న ప్రాథమిక సమాచారం ఆధారంగా...ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా ఓ టీమ్‌ని అక్కడికి పంపించారు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నప్పటికీ..సోషల్ మీడియా అకౌంట్స్ యాక్టివ్‌గా ఉన్నాయి. వీటి ద్వారానే పోలీసులు నిందితుడిని ట్రాక్ చేశారు.
ఒకే ప్లేస్‌లో ఉండటంతో పాటు క్రెడిట్ కార్డ్ కూడా వినియోగించినట్టు విచారణలో తేలింది. నిజానికి...శంకర్ శేఖర్ శర్మ బాధితురాలితో మాట్లాడాడు. పరిహారం కింద రూ.15,000 కూడా చెల్లించాడు. కంప్లెయింట్ వెనక్కి తీసుకోవాలని కోరాడు. అయితే...బాధితురాలి కూతురు మాత్రం ఇది అంగీకరించలేదు. డబ్బు తిరిగి ఇచ్చేసింది. అప్పటి నుంచి మళ్లీ కేసు మొదటికి వచ్చింది. అమెరికాలోని వెల్స్‌ఫార్గో కంపెనీలో పని చేస్తున్న శంకర్ శర్మను ఆ సంస్థ విధుల నుంచి తొలగించింది. ఇలా ప్రవర్తించే వారికి తమ కంపెనీలో చోటు ఇవ్వలేమని, క్రెడిబిలిటీ కోల్పోలేమని స్పష్టం చేసింది యాజమాన్యం.