Viral Video: 'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలెన్నో!' - కీరవాణికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్
VC Sajjanar: ఓ అంధ యువకుడు తన టాలెంట్‌తో ఔరా అనిపించారు. ఆర్టీసీ బస్సుల్లో అద్భుతంగా పాడగా.. ఈ వీడియోను ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
Tgsrtc MD Sajjanar Shares Blind Young Man Talent Video: తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు ఆసక్తికర అంశాలను పంచుకుంటారు. తాజాగా, ఓ యువకుడు కళ్లు లేకపోయినా అద్భుతంగా పాటలు పాడిన వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. యువకుడు ఆర్టీసీ బస్సులో 'శ్రీ ఆంజనేయం' సినిమాలోని పాటను పాడగా అతన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. 'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా. ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి సర్' అని పేర్కొన్నారు. దీన్ని చూసిన నెటిజన్లు యువకుడి టాలెంట్ అద్భుతం అంటూ ప్రశంసిస్తున్నారు. నిజంగానే మట్టిలో మాణిక్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారికి అవకాశం ఇచ్చి చేయూత అందించాలని పలువురు కోరుతున్నారు.
మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో..!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 10, 2024
ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..! ఒక అవకాశం ఇచ్చి చూడండి @mmkeeravaani సర్.@tgsrtcmdoffice @TGSRTCHQ @PROTGSRTC pic.twitter.com/qu25lXVzXS
Also Read: Tiger Tension: మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం - ఈ గ్రామాలకు అటవీ అధికారుల అలర్ట్