Karnataka: యువకుడ్ని చెంప దెబ్బ కొట్టిన ఎమ్మెల్యే- ఎందుకో తెలుసా?
కర్ణాటకలో ఓ యువకుడ్ని ఎమ్మెల్యే చెంప దెబ్బ కొట్టిన వీడియో వైరల్ అవుతోంది.
కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ యువకుడ్ని చెంప దెబ్బ కొట్టడం తీవ్ర దుమారం రేపింది. రోడ్లు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించడంతో ఎమ్మెల్యే వెంకట రమణప్ప ఆ యువకుడ్ని చెంపదెబ్బ కొట్టారు.
ఏం జరిగింది?
ఈ నెల 19 న ఓ సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే వెంకట రమణప్ప బయటికి వస్తుండగా నాగేనహళ్ళికి చెందిన నరేంద్ర అనే యువకుడు ఆయన్ను కలిశాడు. హుసేన్‌పురం, ర్యాపిట, నాగేనహళ్ళి గ్రామాలకు చెందిన రోడ్లను ఎప్పుడు వేస్తారని ఎమ్మెల్యేని ప్రశ్నించాడు.
మీ గ్రామాలకు రూ 3.50 కోట్లను మంజూరు చేశామని, వారంలోగా పనుల్ని ప్రారంభిస్తామని ఎమ్మెల్యే బదులిచ్చారు. దానికి ఆ యువకుడు "ఏ .... నా కొడుకూ విన్పించుకోడు" అని కోపంగా అన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే ఆ యువుకుడ్ని చెంప దెబ్బ కొట్టారు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
In Karnataka, Venkataramanappa, Congress MLA from Pavagada, slaps a youth who asked for road in his village.
— Amit Malviya (@amitmalviya) April 21, 2022
After Siddaramaiah and DKS slapping Congress workers in public, this is a new low.
Reminds us of Amethi, where Rahul asked a young man demanding road to join the BJP. pic.twitter.com/XhYeldhZII
In Karnataka, Venkataramanappa, Congress MLA from Pavagada, slaps a youth who asked for road in his village. pic.twitter.com/uVXK5NnztT
— koustav ghosh (@k4koustav) April 21, 2022
ఈ వీడియోను పలువురు భాజపా నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా తాలూకాపీసు ఎదుట భాజపా నాయకులు గురువారం ఆందోళన చేశారు. రోడ్డు వేయాలని కోరితే దాడి చేస్తారా?, ప్రజలను రక్షించాల్సిన ఎమ్మెల్యే చెంపదెబ్బ కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.