YS Sharmila Arrest: వైఎస్ షర్మిల అరెస్టు... నిరుద్యోగ దీక్షకు అనుమతి నిరాకరించడంపై షర్మిల ఆగ్రహం... సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
నిరుద్యోగ దీక్షకు అనుమతి లేదని పోలీసులు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అరెస్టు చేశారు. షర్మిలను మేడిపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు.
తెలంగాణ మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో నిరుద్యోగ నిరాహార దీక్ష చేసేందుకు ప్రయత్నించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రతి మంగళవారం రాష్ట్రంలో ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్ష చేపట్టేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ ఆమె దీక్షకు దిగారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. షర్మిలను మేడిపల్లి పోలీసు స్టేషన్ కు తరలిస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులను అడ్డుకోవడానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు.
Also Read: Sharmila Dalit Agenda : ఇక షర్మిల పార్టీ దళిత భేరీలు ! తెలంగాణలో రాజకీయం అంతా దళితుల చుట్టే !
దీక్షకు అనుమతి నిరాకరణ
తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి యువత మోసపోయారని వైఎస్ షర్మిల ఆరోపించారు. సీఎం కేసీఆర్ వందల మంది నిరుద్యోగుల ప్రాణాలు బలిగొన్నారని మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో నిరుద్యోగ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడం పట్ల షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రభుత్వాలకు సేవ తప్ప, సామాన్యుల రక్షణ పట్టించుకోవడం ఆరోపించారు.
రోడ్డుపై బైఠాయించి ఆందోళన
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద మంగళవారం కొంత ఉద్రిక్తత నెలకొంది. ఆత్మహత్య చేసుకున్న రవీంద్ర కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనుమతి నిరాకరించినా నగరంలోని బోడుప్పల్‌లో దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగుతుందని ఆమె ప్రకటించారు.
దీంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అక్కడికి తరలివచ్చారు. తాము శాంతియుతంగా దీక్ష చేయాలనుకుంటే ఎందుకు అనుమతివ్వలేదని షర్మిల ప్రశ్నించారు. అక్కడ పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో షర్మిల, ఆమె పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. విషయం తెలియడంతో మేడిపల్లి పీఎస్‌కు వైఎస్సార్టీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. దీంతో షర్మిలను పోలీసులు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు KCR తొత్తులుగా మారి శాంతియుతంగా దీక్షలు చేస్తున్న మాకు, అనుమతి ఇచ్చి, చివరి నిమిషంలో మాట మార్చి, మా దీక్షను భంగం చేసి, మా కార్యకర్తలని లాఠీలతో కొట్టి, మద్దతిస్తున్న యువతను అరెస్ట్ చేసి, నన్ను హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన మా నిరుద్యోగ దీక్షలు నోటిఫికేషన్లిచ్చే దాక ఆగవు. pic.twitter.com/THap4PWJJS
— YS Sharmila (@realyssharmila) September 21, 2021
షర్మిల దీక్ష వద్ద కూలీల ఆందోళన
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో షర్మిల నిరుద్యోగ దీక్ష ప్రదేశంలో కొంత మంది కూలీలు ఆందోళనకు దిగారు. షర్మిల చేపట్టనున్న దీక్షకు తమను తీసుకొచ్చి డబ్బు ఇవ్వట్లేదని వారు ఆరోపించారు. దీక్షలో కూర్చుంటే రూ.400 ఇస్తామని చెప్పి తమను పిలుచుకొని వచ్చారని, ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వడం లేదని నిరసన చేశారు. ఇవాళ పీర్జాదిగూడలో షర్మిల చేపట్టబోయే నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అనంతరం ఆమెను అరెస్టు చేశారు.
Also Read: Sharmila : చేవెళ్ల టు చేవెళ్ల ... అక్టోబర్ 20 నుంచి షర్మిల పాదయాత్ర