YS Sharmila: ఖబడ్దార్ కేసీఆర్! నీ దొర పోకడలు సాగనివ్వను, నీ మెదడు మత్తుతో మొద్దుబారిందా? వైఎస్ షర్మిల ధ్వజం

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో షర్మిల దళిత భేరి బహిరంగ సభ నిర్వహించారు.

FOLLOW US: 

దళితుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దొంగ ప్రేమ కనబరుస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు ఉన్నందునే దళిత బంధు పథకం తెచ్చానని నిస్సిగ్గుగా కేసీఆర్ చెప్పారని.. దాన్ని బట్టే ప్రేమ దళితులపైనా? ఎన్నికల మీదనా? అనేది తేలిపోతుందని అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో షర్మిల దళిత భేరి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా దళితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు.

‘‘ఎస్సీ ఐఏఎస్‌లను కేసీఆర్‌ అవమానించారు. ఆ అవమానాలతో ఐఏఎస్‌లు ముందే రిటైర్‌ అయ్యారు. కేసీఆర్‌ సలహాదారుల్లో ఒక్క దళిత వ్యక్తి కూడా లేరు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చివరకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తారా? లేదా చెప్పాలి. ఈ ఏడేళ్లలో కేసీఆర్‌ ఒక్కసారి కూడా అంబేడ్కర్‌ విగ్రహానికి దండ వేయలేదు. దళితుల కోసం కేటాయిస్తున్న డబ్బులు ఎవరి చేతుల్లోకి పోతున్నాయి’’

కేసీఆర్ దురాశకు హద్దుల్లేవా
‘‘వైఎస్ హాయాంలో సిద్దిపేట జిల్లాలో భూ పంపిణీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కలెక్టరేట్ కట్టాలని దళితుల భూములను లాగేసుకున్నారు. రైతు వేదిక కట్టేందుకు కూడా దళితుడి భూమినే లాగేసుకున్నారు. కేసీఆర్ భూములు ఎందుకు ఇవ్వలేడు? పేదలు, దళితుల భూములే ఎందుకు లాక్కుంటున్నారు. ఇప్పుడు భూ బ్యాంకులు పెడుతున్నారు. వేల ఎకరాలు జమ చేయడమే భూ బ్యాంకు. పెద్ద దొర కేసీఆర్, చిన్న దొర కేటీఆర్ ఇలా భూములను జమ చేసి తమ బినామీలకు అప్పనంగా ఇచ్చేస్తున్నారు. మీరు ఎంత భూమి స్వాహా చేస్తే మీ కడుపు నిండుతుందో చెప్పండి? మీ దురాశకు హద్దుల్లేవా? ఏం చేయాలనుకుంటున్నారు తెలంగాణను? దళితులకు భూములు ఇవ్వాలంటే.. భూసేకరణ ఉండాలి కదా? ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు.’’

800 రెట్లు అధికంగా దళితులపై దాడులు
‘‘కేసీఆర్ సీఎం కాకముందు దళితులపై సంవత్సరానికి 270 దాడులు జరిగితే, కేసీఆర్ సీఎం అయ్యాక దళితులపై జరిగిన దాడులు 800 రెట్లు పెరిగాయి. నేరెళ్ల ఘటనలో ఏం జరిగిందో మీరంతా చూశారు. భువనగిరిలో దళిత మహిళను పోలీసులు హత్య చేశారు. ఆసిఫాబాద్‌లో దళిత మహిళను అత్యాచారం చేసి చేతి వేళ్లు నరికేశారు. అయినా కేసీఆర్ నోరు మెదపడం లేదు. ఎందుకు కేసీఆర్ నోరు మెదపట్లేదు? గుండె రాయిగా మారిందా? మత్తుతో మెదడు మొద్దుబారిపోయిందా?’’

ఖబడ్దార్ కేసీఆర్
‘‘డబ్బులేని వారు చదువుకోవాలని వైఎస్ ఫీజు రీఎంబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు పేదింటి బిడ్డలు చదువుకోవద్దని ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఆపేశాడు కేసీఆర్. మెస్ బిల్లులు ఇవ్వట్లేదు. ఖబడ్దార్ కేసీఆర్... నీ దొర పోకడలు ఇక సాగనివ్వను. మీ పాలనకు చావు డప్పు కొట్టే రోజు త్వరలోనే ఉంది.’’ అని షర్మిల తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

ఎన్నికలపైనే ప్రేమ
‘‘హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు ఉన్నాయని దళిత బంధు పెడుతున్నానని కేసీఆర్ నిస్సిగ్గుగా చెప్పాడంటే.. ఈయనకు ప్రేమ ఉన్నది దళితుల మీదనా? ఎన్నికల మీదనా? అనేది అక్కడే తేలిపోతుంది. ఒక్కో దళిత కుటుంబానికి కేసీఆర్ రూ.60 లక్షలు బాకీ ఉన్నాడు. ఎలాగంటే.. మూడెకరాల భూమి, దానిపై వచ్చే పంట మొత్తం కలిపితే రూ.60 లక్షలు అవుతుంది. మీలో ఎవరికైనా దళిత బంధు కింద రూ.10 లక్షల సాయం అందిందా? రూ.10 లక్షలు ఇస్తే తీసుకోండి. అలాగే మిగతా డబ్బులు కూడా ముక్కు పిండి వసూలు చేస్కోండి. డబ్బులకు బదులు ఒక ఉద్యోగం ఇస్తే ఓ కుటుంబం స్థిరపడుతుంది. కళ్లముందే 1.9 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అందులో 35 వేల మంది దళితులకు ఉద్యోగాలు వస్తాయి. అదే జరిగితే రాబోయే తరాలు ఎంతో బాగుంటాయి.’’ అని షర్మిల ప్రసంగించారు.

‘‘దళితులకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది. మొన్న మందక్రిష్ణ మాదిగ ఇంటికి వెళ్లా. ఇప్పటిదాకా ఎస్సీ వర్గీకరణ జరగలేదని.. మీ నాన్న ఉంటే జరిగిపోయేది అని ఆయన అన్నారు. దానికోసం పోరాటం చేస్తున్న మందక్రిష్ణ అన్నకు నా ధన్యవాదాలు. మాకు మద్దతు పలికినందుకు ధన్యవాదాలు చెబుతున్నా. వైఎస్ బిడ్డగా మేం పార్టీ పెట్టి 100 రోజులు కూడా కాలేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని మాటిస్తున్నా. దళిత ఉప కులాలందరికీ రిజర్వేషన్ ప్రయోజనాలు అందించడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం’’ అని షర్మిల హామీ ఇచ్చారు.

కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకే ఆయన పాలన నచ్చక బయటికొచ్చిన ప్రజా గాయకుడు ఏపూరి సోమన్నను తుంగతుర్తి అభ్యర్థిగా షర్మిల ప్రకటించారు. తుంగతుర్తి ప్రజల కోసం సోమన్న పని చేస్తాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హామీ ఇస్తుంది.

Published at : 12 Sep 2021 08:16 PM (IST) Tags: YS Sharmila dalitha bheri meeting thungathurthy Suryapet Dist Sharmila on KCR

సంబంధిత కథనాలు

Pawan Kalyan : తెలంగాణలో జనసేన జెండా ఎగరవడం ఖాయం, పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan : తెలంగాణలో జనసేన జెండా ఎగరవడం ఖాయం, పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

TRS Rajyasabha Candidates: ఖమ్మంపై సీఎం కేసీఆర్‌ కన్ను - రెండు రాజ్యసభ స్థానాలు లాభం చేకూర్చేనా ?

TRS Rajyasabha Candidates: ఖమ్మంపై సీఎం కేసీఆర్‌ కన్ను -  రెండు రాజ్యసభ స్థానాలు లాభం చేకూర్చేనా ?

Nalgonda: ప్రియుడితో వెళ్లిపోయిన భార్య, తిరిగొచ్చేస్తానని మళ్లీ భర్తకు ఫోన్ - ఊహించని షాక్ ఇచ్చిన భర్త

Nalgonda: ప్రియుడితో వెళ్లిపోయిన భార్య, తిరిగొచ్చేస్తానని మళ్లీ భర్తకు ఫోన్ - ఊహించని షాక్ ఇచ్చిన భర్త

Nalgonda: ‘పైసలియ్యి, లేకుంటే చావు’ పెళ్లి కాకముందే కట్నం కోసం వరుడి మెసేజ్‌లు - యువతి ఆత్మహత్య

Nalgonda: ‘పైసలియ్యి, లేకుంటే చావు’ పెళ్లి కాకముందే కట్నం కోసం వరుడి మెసేజ్‌లు - యువతి ఆత్మహత్య

Telangana CM KCR మనవడు ఏ బియ్యం తింటున్నాడో, వారికి అదే బియ్యం అందిస్తున్నాం: కేటీఆర్

Telangana CM KCR మనవడు ఏ బియ్యం తింటున్నాడో, వారికి అదే  బియ్యం అందిస్తున్నాం: కేటీఆర్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం