YS Sharmila Son : కుమారుడి విజయంపై వైఎస్ షర్మిల ఎమోషనల్ - వారసుడు ఏం సాధించారంటే ?
కుమారుడి గ్రాడ్యూయేషన్ డేలో పాల్గొనేందుకు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా కుమారుడి విజయంపై భావోద్వేగంతో ట్వీట్ చేశారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ( YS Sharmila ) పుత్రోత్సాహంతో ఉన్నారు. ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి అమెరికాలో సదరన్ మెధడిస్ట్ యూనివర్శిటీలో ( SMU ) గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యూయేషన్ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా షర్మిల హాజరయ్యారు. షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ ( Ys vijayamma ) కూడా వెళ్లారు. ఈ సందర్భంగా యూనివర్శిటీలో జరిగిన గ్రాడ్యూయేషన్ సెర్మనీలోనూ వీరు పాల్గొన్నారు. తన ఆనందాన్ని షర్మిల సోషల్ మీడియా ( Social Media ) ద్వారా వెల్లడించారు. పొత్తిళ్లలో ఎత్తుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎదిగిన వైనం చూస్తూంటే అద్భుతంగా ఉందని కుమారుడిని ( Sharmila Son ) అభినందించారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ బూటకం, సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు
ఎస్‌ఎంయూలో జరిగిన వేడుకల్లో షర్మిల భర్త అనిల్ కుమార్ ( Anil Kumar ) , కుమార్తె కూడా హాజరయ్యారు. వీరందరితో కలిసి ఉన్న హ్యాపీ మూమెంట్స్ ఫోటోలను షర్మిల షేర్ చేసుకున్నారు.
Congratulations on your graduation Raja!
— YS Sharmila (@realyssharmila) May 20, 2022
It was an absolute pleasure to watch you grow from the baby in my arms to the wonderful man you’ve become today. Be truthful & kind, always valuing the people around you.God bless you & make you a blessing to many!
Proud of you kiddo :) pic.twitter.com/Biw0x2mkaj
సెక్స్ వర్కర్స్‌కూ గౌరవంగా బతికే హక్కు ఉంది -అడ్రస్ ఫ్రూఫ్ లేకుండానే ఆధార్ ఇవ్వాలని సుప్రీం ఆదేశం !
తెలంగాణలో ( Telangana ) రాజన్న రాజ్యం తీసుకు వస్తానని... వైఎస్ఆర్ టీపీని ( YSRTP ) ప్రారంభించారు. సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తున్నారు. కుమారుడి గ్రాడ్యూయేషన్ కార్యక్రమం కోసం పాదయాత్రకు విరామం ఇచ్చి అమెరికా వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ పాదయాత్ర కొనసాగించే అవకాశం ఉంది. షర్మిల ఆనందాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేతలు కూడా షేర్ చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.
జూలై, ఆగస్టులో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసమే ఈ సమాచారం