By: ABP Desam | Updated at : 20 May 2022 01:30 PM (IST)
సెక్స్ వర్కర్స్‌కూ ఆధార్ కార్డులు ( Image Source : ANI )
దేశంలోని సెక్స్ వర్కర్లకు కూడా ఆధార్ కార్డులు జారీ చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి ఒక్కరికి సమానంగా, గౌరవంగా బతికే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరికి సమానంగా, గౌరవంగా బతికే హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేసిన ప్రోఫార్మా ఆధారంగా ఆధార్ కార్డు ఇవ్వాలని సూచించింది. జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు, జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ ఏఎస్ బొపన్న ఆధ్వర్యంలోని బెంచ్ గురువారం ఈ తీర్పు ఇచ్చింది.
కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ, పోలీసులను ఆశ్రయించిన భర్త
అయితే ఆధార్ కార్డులో వారు సెక్స్ వర్కర్స్ అనే ఐడెంటిటీ కనిపించకూడదని స్పష్టం చేసింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ లేదా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి చెందిన గెజిటెడ్ ఆఫీసర్స్ జారీ చేసే సర్టిఫికెట్ల ఆధారంగా యూఐడీఏఐ సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు జారీ చేయాలి. ఆధార్ కార్డులు ఇచ్చేందుకు సెక్స్ వర్కర్లను ఎలాంటి దృవీకరణ పత్రాలు అడగాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. నివాస ధృవీకరణ కూడా అవసరం లేదని కోర్టు తెలిపింది. ఎలాంటి పత్రాలు లేకున్నా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆధార్ కార్డులు తప్పనిసరిగా జారీ చేయాలి. వాళ్లకు రేషన్ అందేలా చూడాలి. వోటర్ ఐడీ కార్డులు కూడా అందివ్వాలని ఆదేశించింది.
భార్య సంపాదిస్తున్నా భరణం ఇవ్వాల్సిందే- విడాకుల కేసులో బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు
NACO అనేది కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ క్రింద ఒక విభాగం, సెక్స్ వర్కర్ల కు సంబంధించిన డేటాబేస్ నిర్వహిస్తుంది. సెక్స్ వర్కర్లకు సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడం, పునరావాస పథకాన్ని రూపొందించడంపై వేసిన పిటిషన్‌ను విచారించారు. 2011 నుంచి ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షిస్తోంది. సెక్స్ వర్కర్లపై NACO వద్ద ఉన్న సమాచారాన్ని నివాస రుజువుగా పరిగణించవచ్చో లేదో.. దాని ఆధారంగా వారికి ఆధార్‌ను ఇవ్వవచ్చో పరిశీలించాలని జనవరి 10న కోర్టు ఇచ్చిన ఉత్తర్వుకు ప్రతిస్పందనగా UIDAI అఫిడవిట్ వచ్చింది.
యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం- వీడియో చూశారా?
కరోనా లాక్ డౌన్ లాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు వీరికి జీవనాధారం లభించడం లేదని.. ప్రభుత్వ పథకాలు కూడా ివ్వడం లేదని.. సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. ఈ పిల్ విచారణ సందర్భంగా కోర్టు తాజా సూచనలు చేసింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది లక్షల మంది మహిళా సెక్స్ వర్కర్లు, ట్రాన్స్‌జెండర్ సెక్స్ వర్కర్లకు మేలు జరగనుంది.
ED Raids Chinese Mobile Companies: చైనా మొబైల్ కంపెనీలకు ఈడీ షాకు! 40 ప్రాంతాల్లో సోదాలు
Same Sex Marriage: ఆ ఇద్దరు మగాళ్లు ఒక్కటయ్యారు, ఘనంగా పెళ్లి చేసుకున్న పురుషులు - తాజ్ మహల్ వద్ద లవ్ ప్రపోజ్
Mainpuri UP: సహనం కోల్పోయి పోలీసుపై యువకుడి దాడి- వీడియో వైరల్
Covid Update: దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు- 19 మంది మృతి
Assam Floods: ఆ వరదలు కావాలని సృష్టించినవే- తాజాగా ఇద్దరు అరెస్ట్!
Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్
Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?
MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు
Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్